రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి, ఛార్మి ఇద్దరు కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ రెండు సినిమాలు అంచనాలను అందుకోక ఫ్లాప్ అవడంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో ఉన్నాడు విజయ్ దేవరకొండ. 

 

మూవీ తర్వాత విజయ్ నెక్స్ట్ ఏ డైరక్టర్ తో చేస్తాడు అన్నది ఇంకా ఫైనల్ అవలేదు. నిన్ను కోరి, మజిలీ సినిమాల దర్శకుడు శివ నిర్వాణ డైరక్షన్ లో విజయ్ సినిమా ఉంటుందని అంటున్నారు. తన హీరోయిన్స్ విషయంలో స్పెషల్ గా ఉండే విజయ్ తన విష్ లిస్ట్ లో ఎవరితో జత కట్టాలని ఉందని అడిగితే తన మనసులో ఉన్న ఇద్దరు హీరోయిన్స్ పేర్లు బయట పెట్టాడు. తనకు బాలీవుడ్ భామలు కియరా అద్వానీ, జాన్వీ కపూర్ లతో జోడీ కట్టాలని ఉందని అన్నాడు. మనోడి సినిమాలో లిప్ లాక్స్ ఖచ్చికంగా ఉంటాయి. అంటే వాళ్ళిద్దరితో రొమాన్స్ కు రౌడీ హీరో ఎక్సయిటింగ్ గా ఉన్నాడన్నమాట.

 

పూరి సినిమాకు అసలైతే ముందు జాన్విని తీసుకోవాలని అనుకున్న ఆమె ఎక్కువ డిమాండ్ చేయడంతో అనన్య పాండేతో సర్దుకుంటున్నారు. ఇక కియరా అద్వానీ మాత్రం ఇప్పటికే విజయ్ తో ఒక యాడ్ లో నటించింది. ఇద్దరు కలిసి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో చరణ్ కు జోడీగా కియరా నటిస్తుందని అంటున్నారు. రామ్ చరణ్ తో వి.వి.ఆర్ సినిమా చేసిన కియరా బాలీవుడ్ లో తెగ బిజీ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: