ఇంతవరకు ఉన్న అన్ని ప్రాణాంతక వ్యాధులను పక్కన పెట్టి ఇప్పుడు ప్రజలను వణికిస్తున్న కరోనా.. రోజు రోజుకు తన ప్రతాపాన్ని చూపిస్తూ భయంకరంగా విస్తరిస్తుంది.. ఇప్పుడు కరోనా పేరు చెబితే లోకం మొత్తం గజగజలాడుతుంది.. ప్రతి వారి గుండెలు ఏ క్షణం ఆగిపోయే వార్త ఎప్పుడు వినవలసి వస్తుందో అని క్షణం క్షణం టెన్షన్‌తో బ్రతకవలసిన పరిస్దితులు ప్రపంచంలో తలెత్తాయి.. ఏ స్వార్ధపరుడి ఆలోచన నుండి ఈ కరోనా పుట్టిందో తెలియదు.. అసలు ప్రపంచాన్ని ఇంతలా నాశనం చేసి వాడొక్కడు ఏం చేద్దామనుకుంటున్నాడో తెలియదు.. కానీ సమస్త మానవాళీ మాత్రం ఇప్పుడు ప్రమాదం అంచుకు చేరుతుంది..

 

 

కరోనా అనే మహమ్మారి తన కొరలు చాచి విచ్చలవిడిగా విహరిస్తుంది.. ఇకపోతే 10 రోజుల క్రితం బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న యువకుడు (30) తన స్వగ్రామం అయినా గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు శనివారం రాత్రి పల్నాడు రైల్లో వెళ్లాడట.. ఇతను తెలుగు సినీ పరిశ్రమలో సహాయ నటుడిగా నటిస్తాడని సమాచారం.. కాగా అతని ఇంటికి చేరుకున్న ఆ యువకునికి గత వారం రోజులుగా జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్లు బాధిత యువకుడి తల్లి చెప్పారు.

 

 

అయితే మొదట ఇతను వైద్య సేవలు చేయించుకునేందు సహకరించలేదని తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వైద్య పరీక్షలు చేయాంచుకోవాలని చెప్పడమే కాకుండా ఆ యువకుడికి అవగాహన కూడా కల్పించి, అతన్ని ఓప్పించారట.. వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు, వైద్య బృందం బాధిత యువకుడిని తరలించినట్లు సమాచారం. కాగా, బ్యాంకాక్‌లో ఇప్పటి వరకు దాదాపు 600 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గుంటూరులో కరోనా అనుమానిత కేసు నమోదు కావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది...

మరింత సమాచారం తెలుసుకోండి: