ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతుంది. ఎక్కడో చైనాలోని ఓ మార్కెట్‌ లో పుట్టిన ఈ వైరస్‌ దాదాపు అన్ని దేశాలను గజగజలాడిస్తోంది. దీంతో ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. అడుగు తీసి అడుగు వేయాలంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు తమ అభిమానులకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెపుతున్నారు.

 

అయితే సౌత్ స్టార్ హీరోయిన్‌ నయన్‌, బాయ్‌ ఫ్రెండ్‌, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ కూడా ప్రజలకు కొన్ని జాగ్రత్తలు సూచించాడు. ప్రధాన మంత్రి పిలుపు మేరకు నిన్న సాయంత్రం 5 గంటలకు కరోనా విపత్తు ఎదుర్కొనేందుకు పోరాడుతున్న డాక్టర్లు, మున్సిపాలిటీ కార్మికులు, పోలీసులకు సంఘీభావంగా చప్పట్లు కొడుతున్న ఫోటోను సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు. అయితే ఆ ఫోటోనే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

 

ఏ మాత్రం ఛాన్స్‌ దొరికినా తమలోని రొమాంటిక్‌ యాంగిల్ ను చూపించే నయన్‌, విఘ్నేష్‌ లు ఈ సందర్భాన్ని కూడా అందుకే వాడుకున్నారు. నయన్‌ చేయి ఒకటి, విఘ్నేష్‌ చేయి ఒకటి కలిపి చప్పట్లు కొడుతున్నట్టుగా ఉన్న ఫోటోను తన పేజ్‌లో పోస్ట్ చేసిన విఘ్నేష్, `వీరుల కోసం చప్పట్టలు కొడుతున్నాం. కరోనాతో పోరాటంలో అంతా క్రమ శిక్షణ పాటించండి` అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ సినిమా పోస్ట్ కు ఎలాంటి రెస్సాన్స్‌ వస్తుందో విఘ్నేష్ ముందుగానే ఊహించినట్టున్నాడు, అందుకే కామెంట్లు కనిపించకుండా ఆపేశాడు విఘ్నేష్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: