ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిన్న దేశంలోని 130 కోట్ల ప్రజానీకం జనతా కర్ఫ్యూకు తమ సంఘీభావాన్ని తెలియచేసారు. పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ జూనియర్ అల్లు అర్జున్ లాంటి ఎందరో టాప్ హీరోలు ప్రధాని పిలుపుకు బాసటగా నిలిచి తమ సామాజిక చైతన్యాన్ని చాటుకున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆయన సతీమణి శ్యామల నిన్న జనతా కర్ఫ్యూ‌లో పాల్గొని  కరోన సమస్య పై పోరాటం చేస్తున్న పారిశుద్ధ కార్మికులు పోలీసులు మీడియా వారికి తన సంఘీభావాన్ని తెలియచేసారు. 


ఈ సందర్భంగా మీడియా వర్గాలతో కృష్ణంరాజు మాట్లాడుతూ దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు తారకమంత్రంగా పని చేసిందని కామెంట్ చేసారు. ఇదే సందర్భంలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ జార్జియా షూటింగ్ నుండి వచ్చిన తరువాత ప్రభాస్ తనకు తానుగా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న విషయాన్ని వివరిస్తూ ప్రభాస్ తో పాటు తన కూతురు ప్రభాస్ చెల్లెలు సాయి ప్రసీద సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న విషయాన్ని తెలియచేసాడు. 


ఈవిషయాన్ని అధికారికంగా తాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియపరిచిన విషయం పై క్లారిటీ ఇచ్చాడు. విదేశాల నుండి వచ్చిన వారు వారికి ఎలాంటి అస్వస్థత లేకపోయినప్పటికీ ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చి స్వచ్ఛంద గృహనిర్బంధంలోకి వెళ్ళటం వారి బాధ్యత అన్న విషయం తనకు స్పష్టంగా తెలిసిన నేపధ్యంలో ప్రభాస్ విషయంలో మాత్రమే కాకుండా తన కూతురు విషయంలో కూడ తాను ఇలా స్పష్టంగా వ్యవహరిస్తున్నట్లు కృష్ణంరాజు క్లారిటీ ఇచ్చాడు. 


కృష్ణంరాజు ఇచ్చిన క్లారిటీతో ప్రభాస్ పై ఇప్పటి వరకు వచ్చిన వార్తలకు తెర పడినట్లు అయింది. వాస్తవానికి నిన్న సాయంత్రం జరిగిన చప్పట్ల కార్యక్రమంలో టాప్ హీరోలు అంతా కనిపించినా ప్రభాస్ కనిపించక పోవడంతో అతడి పరిస్థితి పై కృష్ణంరాజు ఈ విధంగా క్లారిటీ ఇచ్చాడు అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: