బాలీవుడ్ సింగర్ కనికా కపూర్.. ఈ పేరు ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈమె చేసిన త‌ప్పుకు ఎంద‌రో స‌ఫ‌ర్ అవ్వాల్సి వస్తుంది. లఖ్‌నవూలో కనికా కపూర్ వల్ల కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు మరింత ఎక్కువయ్యే ప్రమాదం పెరిగింది. ఇప్పుడు ఆమె వల్ల నగరంలోనే కాదు, మొత్తం రాష్ట్రమంతటా కలకలం నెలకొంది. ఇటీవల సింగర్ కనికా కపూర్‌ లండన్ నుండి తిరిగొచ్చిన తర్వాత కరోనా వ్యాది లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన డాక్టర్స్ ఆమెను నిర్భదంలో ఉండమని చెప్పారు.. అయినా కూడా ఆమె డాక్టర్స్ సలహాను పక్క చెవిన పెట్టి పలు పార్టీలకు హాజరైంది. 

 

అయితే ఆమె హాజరైన ఈ పార్టీలకు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. కనిక కపూర్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఆమె ఇచ్చిన డిన్నర్ పార్టీకి వెళ్లిన వారితో సహా... మొత్తం 183 మందికి కరోనా వైరస్ టెస్టులు జరుపుతున్నారు. ఇప్పటికైతే వారిలో 60 మందికి కరోనా వైరస్ నెగిటివ్ వచ్చిందని సమాచారం. కానీ మిగిలిన వారు మాత్రం చాలా భయాందోళనకు గురవుతున్నారు. కాగా మహారాష్ట్ర లోని ఒక ప్రత్యేకమైన ల్యాబ్ లో వారందరికీ కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

 

అయితే వారిలో అందరికి కరోనా వైరస్ నెగటివ్ వస్తే ఎలాంటి ప్రమాదం లేదు కానీ, ఒకవేళ వారికి గనక కరోనా పాజిటివ్ వస్తే మాత్రం వారివల్ల ఈ వైరస్ ఇంకెంత మందికి సోకిందని అనుమానాలు కూడా భారీగా వస్తున్నాయి. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రజలంతా ఒక్కటైన ఈ  సందర్భంలో హిందీ సింగర్ కనికా కపూర్‌ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. దీంతో చాలా మంది రిస్క్‌లో ప‌డ్డారు. కాగా, క‌నికా ఇచ్చిన పార్టీకి బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ సహా పలువురు హాజరయ్యారు. 

 

కనికా కపూర్ కరోనా పాజిటివ్ అని తేలడంతో.. దుష్యంత్ సింగ్ సహా అతని త్లి రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే స్వయంగా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. వీరితోపాటు ఆ పార్టీకి హాజరైన ప్రముఖులు కూడా బయటకి రావడం లేదు.

  
 

మరింత సమాచారం తెలుసుకోండి: