ప్రస్తుతం ప్రపంచాన్ని ఏదైనా వణికిస్తోంది అంటే అది కరోనా వైరసే. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ కారణంగా 3 లక్షలమందికిపైగా బాధితులు ఉండగా 14వేలమంది ఈ కరోనా వైరస్ వల్ల మృతి చెందారు. 4 లక్షలమంది ఈ కరోనా వైరస్ కోలుకుంటున్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు అన్ని తిరిగి మన భారత్ కు లో కూడా ఈ కరోనా వైరస్ బాధితులు ఉన్నారు. 

 

ఇప్పటికే ఈ కరోనా వైరస్ కారణంగా మన భారత్ లో 7మంది మృతి చెందారు. 350మందికి పైగా ఈ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇంకా ఈ నేపథ్యంలోనే నిన్న దేశవ్యాప్తంగా కరోనా జనతా కర్ఫ్యూ విధించారు. దీంతో ప్రజలంతా కూడా నిన్న ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరుకు ఇంట్లోనే ఉండి జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారు. 

 

అయినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి ఆగకపోయేసరికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నెల 31వ తేదీ వరుకు లాక్ డౌన్ చేశారు. దీంతో ప్రజలందరూ కూడా చాలా వరుకు ఇంటికే పరిమితమయ్యారు. ఇంకా ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ పోస్టు హాల్ చల్ చేస్తుంది. అది ఏంటి అంటే? లావు ఉన్న వారికీ కరోనా వైరస్ రాదు అని. 

 

ఆ పోస్టును చూసి నిజంగా లావు ఉంటే కరోనా వైరస్ రాదా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజానికి కరోనా వైరస్ లావు ఉన్న.. సన్నగా ఉన్న శుభ్రంగా లేకుండా.. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటే కరోనా వైరస్ వస్తుంది. పక్కన ఎవరైనా కరోనా బాధితులు ఉన్న.. శుభ్రంగా లేకుంటే వస్తుంది.. అంతేకాని.. లావు.. సన్నగా.. అందంగా.. ఉన్నవాళ్లకు కరోనా వస్తుంది అని జరిగే ప్రచారాలలో నిజం లేదు.. అలాంటి ప్రచారాలను నమ్మకండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: