కొందరికి కొన్ని కొన్ని నమ్మకాలుంటాయి. ఏం జరిగినా ఆ నమ్మకాలను మాత్రం విడిచిపెట్టరు. బెల్లకొండ సాయి శ్రీనివాస్ కూడా ఇలాగే ఓ నమ్మకాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా.. ఆ నమ్మకాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే కొంతమంది నెటిజన్లు ఈ నమ్మకాలపై సెటైర్లు పేలుస్తున్నారు. 

 

బెల్లం కొండ శ్రీనివాస్ మాస్ హీరోగా ఎదగాలని చాలా కష్టపడుతున్నాడు. ఫస్ట్ మూవీ నుంచే కమర్షియల్ ఫార్ములాలు ఫాలో అవుతున్నాడు. భారీ ఫైట్ లు, ఐటం పాపలు అంటూ హడావిడి చేస్తున్నారు. కానీ బెల్లంకొండ ఇంకా స్టార్ రేస్ కు చేరుకోలేదు. కమర్షియల్ ఫార్ములాతో వెళ్లిన చాలా స్టార్లు ఆడియన్స్ ను మెప్పించలేకపోయాడు. అయినా బెల్లంకొండ మాత్రం ఈ మాస్ ఫార్ములాను విడిచిపెట్టట్లేదు. ఈ సారి ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఐటం పాపగా దింపుతున్నాడు బెల్లకొండ. 

 

డైరెక్టర్ ఎవరైనా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల్లో ఐటం సాంగ్ మాత్రం కామన్. పైగా ఈ సాంగ్స్ లో క్రేజీ హీరోయిన్స్ మెరుస్తుంటారు. ఫస్ట్ రెండు సినిమాలు అల్లుడు శ్రీను, స్పీడున్నోడులో తమన్నాతో కలిసి ఐటం సాంగ్స్ చేశాడు బెల్లంకొండ. తర్వాత జయ జనాకి నాయకలో కేథరీన్ స్పెషల్ సాంగ్ చేసింది. సీతలో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ మెరిసింది. అయితే ఈ సాంగ్స్ క్లిక్ అయినా సినిమాలు మాత్రం పెద్దగా వసూలు చేయలేదు. 

 

బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లుడు అదుర్స్ అనే సినిమా చేస్తున్నాడు. కంప్లీట్ కామెడీ మసాలా ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఐటం సాంగ్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో ఓ సాంగ్ కోసం నిధికి 60లక్షలకు పైగా ఆఫర్ చేశారనే టాక్ వినిపిస్తోంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. బెల్లంకొండ నమ్మకంతో ఐటమ్ పాపలకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కానీ.. అతని సినిమాలకు మాత్రం వసూళ్లు పెరగడం లేదని పాపం హీరోగారు అంటూ కామెంట్ లు పెడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: