ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పూజా హెగ్డే కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముకుంద సినిమా తో మెగా హీరో వరుణ్ తేజ్ తో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత దర్శక నిర్మాతలు అందరిని ఆకర్షించి  స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. మంచి మంచి సినిమాల్లో నటిస్తూ ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలన్ని తన ఖాతాలో వేసుకున్నది  ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇక ఈ అమ్మడికి వస్తున్న అవకాశాల గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు... టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు దర్శక నిర్మాతలు అందరూ ఈ అమ్మడి డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. 

 

 

 అంతలా  క్రేజ్ పెరిగిపోయింది పూజా హెగ్డే కి. ఇక హీరోయిన్లందరూ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ప్రస్తుతం పూజ హెగ్డే కూడా అదే చేస్తోంది. తన హవా నడుస్తున్నప్పుడే ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస విజయాలను దక్కించుకుంటూ... స్టార్ హీరోల సినిమాలకు కేరాఫ్ అటుగా మారిపోయిన పూజా హెగ్డే... పారితోషికాన్ని భారీగా పెంచేసిందట. ఏకంగా తన పారితోషికాన్ని రెండున్నర కోట్ల వరకూ పెంచేసిందట ఈ ముద్దుగుమ్మ. అంతకుమించి పారితోషకం తక్కువ అయితే కష్టమే అని చెబుతుందట. 

 

 

 అయితే ప్రస్తుతం ఈ అమ్మడు అక్కినేని అఖిల్ తో జోడి కట్టిన విషయం తెలిసిందే.  కొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా పూజ హెగ్డే నటిస్తోంది. ఇక హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో  కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన నటిస్తున్న పూజా హెగ్డేసినిమా హిట్ అయితే మాత్రం... ఈ అమ్మడి పారితోషికం రెట్టింపైన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఈ అమ్మడికి ప్రస్తుతం బాలీవుడ్ లో పోటీ ఇచ్చే కథానాయకులు కూడా ఎక్కువ లేకపోవడంతో ఈ అమ్మడు 100 స్పీడ్ తో దూసుకుపోతుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: