ప్రపంచ దేశాలను ప్రాణభయంతో వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం భారతదేశంలో కూడా అడుగు పెట్టి ఎంతో మందిని ప్రాణ భయంతో వణికిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారిగా అప్రమత్తమై పోయి ఎన్ని కఠిన నిబంధనలను అమలు లోకి తెస్తూన్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కడా తగ్గడం లేదు. రోజురోజుకు భారత్ లో  కరోనా వైరస్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. అయితే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా మూగబోయిన విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ షూటింగులు మొత్తం ఆగిపోయాయి. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న  హీరోల సినిమాల వరకూ... అందరి సినిమా షూటింగులు ఆగిపోయాయి. 

 

 

 భారత దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని చిత్ర పరిశ్రమలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనా వైరస్ నియంత్రణకు తాము సహకరిస్తున్నాము  అంటూ తెలిపి సినిమా షూటింగ్లో అన్నింటికీ విరామం ప్రకటించింది. అయితే ఈ సినిమా షూటింగులకు బ్రేక్ పడిన సమయంలో.. హీరోలు దర్శకులు పెద్దపెద్ద నటులకు అంతా మామూలుగానే ఉన్నప్పటికీ... సినిమాల  పైనే ఆధారపడి బతుకుతున్న చిన్నచిన్న కార్మికులకు... అందరికీ ప్రస్తుతం సినిమా చిత్రీకరణ ఆగిపోవడం విఘాతంగా  మారిపోతుంది. రెక్కాడితే కానీ డొక్కాడని పేద కార్మి కులకు ప్రస్తుతం ఉపాధి కరువై కుటుంబ పోషణ భారమై పోతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది సినీ ప్రముఖులు ముందుకొచ్చి సినీ కార్మికులకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. 

 

 

 ఈ క్రమంలోనే దక్షిణ భారత సినీ ప్రేక్షకులందరికీ పెప్సీ హీరో అయిన సూర్య కుటుంబం విరాళం సినీ కార్మికుల కోసం ప్రకటించింది. ప్రస్తుతం సినీ పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగించే చిన్నచిన్న కార్మికుల పట్ల సానుభూతి వ్యక్తం చేసిన సూర్య ఆయన తండ్రి,  సోదరుడు కార్తీ పది లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. కరోనా  వైరస్ విజృంభణ  నేపథ్యంలో సినిమా చిత్రీకరణ ఆగిపోగా... ఉపాధి కోల్పోయి అయోమయంలో పడిన పేద కార్మికుల కోసం విరాళం అందజేస్తున్నట్లు వారు తెలిపారు. ఇక పెద్ద మనసు చాటుకున్న సూర్య తమ్ముడు కార్తీక్ లకు  అభిమానుల నుంచి హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: