దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రజలందరూ కరోనా  వైరస్ నేపథ్యంలో ప్రాణభయంతో నే బతుకుతున్నారు. ఇక ఈ వైరస్ ఎవరి నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఊహించలేకుండా ఉంది  కాబట్టి ఏం చేయాలన్నా వందసార్లు ఆలోచిస్తున్నారు. ఇలా రోజురోజుకు ప్రజలు ప్రాణభయం పెరిగిపోతూ వస్తోంది. ఇక ఈ వైరస్కు సరైన విరుగుడు లేకపోవడం... నివారణ ఒక్కటే మార్గం కావడంతో ఈ వైరస్ గురించి ఆలోచిస్తే చాలు  మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన చర్యలు చేపట్టడంతో పాటు కఠిన నిబంధనలు అమలులోకి తెస్తోన్నాయి. 

 

 

 అయితే కరోనా  వైరస్ విజృంభణ  నేపథ్యంలో ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్ డౌన్  ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం కూడా లాక్ డౌన్  ప్రకటించింది. వ్యాపార సంస్థలు సినిమా షూటింగులు  నిలిచిపోయాయి. అయితే ఇవన్నీ మూతపడిన ప్రభావం శ్రమజీవుల పై ఎక్కువగా పడినట్లు తెలుస్తోంది. రోజువారి కూలీలు ఉపాధి కోల్పోయి కుటుంబ జీవన భారంగా  గా మారిపోతుంది. ఇలాంటి సమయంలోనే చాలా మంది సినీ ప్రముఖులు శ్రమజీవుల కు అండగా నిలిచి తమలోని  మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇక తాజాగా పేద కార్మి కులకు సాయం చేయడానికి సినిమా నటుడు ప్రకాశ్రాజ్ ముందుకొచ్చారు.

 

 

 చెప్పడం కాదు తానే స్వయంగా చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన పొలంలో పనిచేస్తున్న వారితో పాటు ఇల్లు, ప్రొడక్షన్ కంపెనీ, ఫౌండేషన్ ఉద్యోగులు, వ్యక్తిగత సిబ్బంది కి ఏకంగా మూడు నెలల జీతాలు ముందుగానే ఇచ్చేసినట్లు ప్రకాష్ రాజు తెలిపారు. అంతేకాకుండా తాను పనిచేస్తున్న మూడు సినిమాలు చిత్రీకరణ ఆగిపోయిన... ఈ సినిమా షూటింగ్ లో పనిచేస్తున్న రోజువారి వర్కర్లకు కనీసం సగం జీతం ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. తను ఇంతటితో ఆగని... తనకు సాధ్యమైనంత మేరకు సహాయం చేస్తూనే ఉంటాను అంటూ తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన పనిపై  ప్రశంసల వర్షం కురుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: