ప్రస్తుతం ప్రపంచ దేశాలు అందరూ మాట్లాడుకుంటున్నది.. అందరూ భయపెడుతున్నది... అందరినీ పొట్టనబెట్టుకున్నది... అదే ప్రాణాంతకమైన మహమ్మారి కరోనా  వైరస్. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ చైనా దేశంలో మరణ మృదంగం మోగించి వేల సంఖ్యలో ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. అయితే ప్రస్తుతం చైనా దేశంలో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ... ప్రపంచ దేశాల్లో మాత్రం విజృంభిస్తూ  ఇంకెంతో మంది ప్రాణాలను బలితీసుకుంటూ  విలయ తాండవం చేస్తూ మరణ మృదంగం మోగిస్తోంది. కొన్ని కొన్ని దేశాలలో అయితే రోజురోజుకూ పరిస్థితి చేయి దాటి పోతుంది. ఏకంగా అభివృద్ధి చెందిన దేశాలు సైతం కరోనా  వైరస్ ను ఎలా నివారించాలో తెలియక చేతులెత్తేస్తున్నాయి. ఇక రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగి పోతుంది. 

 

 ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో... ప్రజలు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలి అంటేనే భయపడిపోతున్నారు. ఎటునుంచి కరోనా వైరస్ వచ్చి మన మీద వాలిపోయి ప్రాణాలను గాలిలో కలిపేస్తుందో అని భయాందోళన తోనే జీవితాన్ని గడుపుతున్నారు. కేవలం సామాన్య ప్రజలు  సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరికీ సోకుతూ  అందరినీ మృత్యువుతో పోరాడేలా చేస్తుంది ఈ మహమ్మారి వైరస్. దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమై కఠిన నిబంధనలు అమలులోకి తెస్తూన్నప్పటికీ ఈ వైరస్ ప్రభావం మాత్రం అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది. 

 

 

 ఇప్పటికే చాలా మంది ఈ మహమ్మారి వైరస్ బారినపడి ప్రాణాలు వదులుతున్నారు. ఇక తాజాగా ఈ వైరస్ బారిన పడిన ప్రముఖ హాలీవుడ్ నటి సోఫియా మైల్స్  తండ్రి పీటర్ మైల్స్ ని  ఈ మహమ్మారి పొట్టన పెట్టుకుంది. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న పీటర్ కు కరోనా  వైరస్ సోకింది. ఆయనని హాస్పిటల్లో చేర్చి  ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నారు. కానీ ప్రాణాంతకమైన కరోనా వైరస్ ను జయించలేక ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని బాలీవుడ్ నటి సోఫియా తన సోషల్ మీడియా ఖాతాలో తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: