టాలీవుడ్ లోకి అష్టాచమ్మ సినిమాతో హీరోగా పరిచయం అయిన నాని తర్వాత నేచురల్ స్టార్ గా మారారు. అష్టా చమ్మ తర్వాత నాని నటించిన సినిమాలు యావరేజ్ గా నడిచాయి.  మారుతి దర్శకత్వంలో ‘భలే భలే మగాడివోయ్’ మూవీతో ఓ సరికొత్త పంథాకు శ్రీకారం చుట్టాడు నాని.  ఈ మూవీ మతిమరుపు కాన్సెప్ట్ తో ఎమోసన్ సీన్లతో ఆకట్టుకున్నాడు.  భలే భలే మగాడివోయ్  నాని అదృష్టాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పడంలో ఆశ్చర్యంలేదు.  ఈ మూవీ తర్వాత వరుసగా ఆరు సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి.  ఈ మూవీ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూశారు.

 

ఈ కాంబినేషన్లో మరో సినిమా ఎప్పుడు సెట్ అవుతుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు. ఆ సమయం దగ్గరలోనే ఉందనేది తాజా సమాచారం. ఈ మద్య నాని కోసం ఓ మంచి కథను తయారు చేసి ఉంచారట మారుతి.  గత ఏడాది ప్రతిరోజూ పండుగే సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.  తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే  కథను గురించి ఇద్దరు చర్చలు జరపడం చేస్తున్నారట. కథ పూర్తి రూపాన్ని సంతరించుకునే దిశగా ఈ చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. త్వరలోనే కథను లాక్ చేయనున్నట్టు తెలుస్తోంది.

 

 ప్రస్తుతం నాని, సుధీర్ బాబు మల్టీస్టారర్ మూవీగా ‘వి’ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ తరువాత నాని సినిమా మారుతి దర్శకత్వంలోనే ఉంటుందని చెబుతున్నారు. ఈ ఇద్దరికి కలిసి మరో హిట్ కొడతారేమో చూడాలి. ప్రస్తుతం నాని ‘టక్ జగదీశ్’ మూవీలో కూడా నటిస్తున్నాడు.  మరి నాని-మారుతి కాంబినేషన్  లో ఎలాంటి వెరైటీ కాన్సెప్ట్ తీసుకు వస్తారో చూడాలి. ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావం ఉండటంతో షూటింగ్స్ వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: