ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్విస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించి తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించిన దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం తెలుగు చిత్ర చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రేక్షకులు కోరుకునే విధంగా సినిమాలను తెరకెక్కిస్తూ... ఫ్యామిలీ ఎమోషన్స్ ని... కామెడీ ని సరిగ్గా మెయింటెన్ చేస్తూ సంచలన విజయాలు అందుకుంటూ ప్రస్తుతం తనకు తిరుగు లేదు అని నిరూపిస్తున్నారు అనిల్ రావిపూడి. ఇక ఓటమెరుగని దర్శకుడిగా టాలీవుడ్లో దూసుకుపోతున్నారు. యువ దర్శకుడు ఏ సినిమా తెరకెక్కించిన అది ఒక సంచలనం గా మారిపోతుంది. 

 

 ఇప్పటికే పటాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల చూపు మొత్తం ఆకర్షించిన యువ దర్శకుడు సుప్రీం సినిమాతో  ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించాడు... ఇక ఆ తర్వాత రాజా ది గ్రేట్ సినిమా తో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు... ఇక సీనియర్ హీరో వెంకటేష్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ సినిమా ఎఫ్2 తీసి తనకు తిరుగు లేదు అని నిరూపించుకున్నాడు అనిల్ రావిపూడి. ఇక ఆ తర్వాత ఏకంగా టాలీవుడ్ నెంబర్ వన్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీసే  అవకాశాన్ని దక్కించుకున్న అనిల్ రావిపూడి... సరిలేరు నీకెవ్వరు సినిమాను తెరకెక్కించి... మరోసారి సరిలేరు నీకెవ్వరు అని నిరూపించుకున్నాడు.ఈ  ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. 

 

 

 అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన యువ దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ... తనకు అవకాశం వస్తే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మోక్షజ్ఞ, జూనియర్ ఎన్టీఆర్ లతో సినిమాలు తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. నందమూరి బాలయ్య తో ఒక సినిమాను తెరకెక్కిస్తే చూడాలని ఉంది అంటూ చాలా మంది అభిమానులు తనకు చెప్పినట్లు అనిల్ రావిపూడి తెలిపారు. బాలకృష్ణ, మోక్షజ్ఞ ఫోటో తన గదిలో ఉండేది అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. ఎప్పటికైనా మోక్షజ్ఞ ను  డైరెక్ట్ చేస్తాను అంటూ అందరికీ చెప్పేవాడిని.. బాలకృష్ణతో అయినా, ఆయన  తనయుడు మోక్షజ్ఞ తో అయినా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి.

మరింత సమాచారం తెలుసుకోండి: