ఇండియన్ మోస్ట్ ప్రెస్టీజీయస్ ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ ఏ ముహూర్తాన మొదలైందో కానీ సినిమాకు అడుగడుగునా అవాంతరాలు ఎదురువుతూనే ఉన్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు గాయాలు, షూటింగ్ లకు పర్మిషన్లు, హీరోయిన్ మార్పు.. ఇలా ఒకటేమిటి అనేక హర్డిల్స్ వచ్చాయి. ఈ దెబ్బకి ఈ ఏడాది జూలై 30న విడుదల కావాల్సిన సినిమా కాస్తా వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 8న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అయితే.. ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ విపత్కర పరిస్థితులను చూస్తుంటే సంక్రాంతి రిలీజ్ ఉంటుందా అనే అనుమానాలు వస్తున్నాయి.

 

 

ఎన్నో అవాంతరాలు దాటుకుని జరుగుతున్న షూటింగ్ కు ఇప్పుడు బ్రేక్ పడింది. ఇంకా షూటింగ్ జరగాల్సింది ఉంది. హాలీవుడ్, ఇంగ్లీష్ యాక్టర్లు కూడా నటిస్తున్న ఈ సినిమాకు వారితో ఇంకా షూటింగ్ కొంత ఉందని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్లు ఇక్కడ షూటింగ్ లో పాల్గొనాలన్నా.. షూటింగ్ కు ఇతర ప్రదేశాలకు వెళ్లాలన్నా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎప్పటికి చక్కబడతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఈ సమయంలో వారి కాల్షీట్లు క్యాన్సిల్ అవుతాయి. మళ్లీ పరిస్థితులు చక్కబడ్డాక వారి కాల్షీట్లు అవసరమవుతాయి. దీంతో ఈ పరిస్థితులన్నీ నిర్మాత దానయ్యపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.

 

 

ఇప్పటికే కొంత ఖర్చు పెరిగిందని టాక్ వచ్చిన నేపథ్యంలో ఈ పరిస్థితులు మరింత కష్టంగా మారే అవకాశం ఉంది. మరి పరిస్థితులు చక్కబడి షూటింగ్ జరిగితే సంక్రాంతికి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. అదే జరిగితే మరో రిలీజ్ డేట్ ప్రకటించడం ఖాయం. ప్రస్తుతం ఈ విషయాలపై ఎటువంటి ప్రకటన గానీ వార్తలు కానీ లేవు. ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కావడంతో సినీ అభిమానులకు ఈ అనుమానాలు ఎక్కవవుతున్నాయి. మరి టీమ్ ఆలోచన ఎలా ఉందో.

మరింత సమాచారం తెలుసుకోండి: