యంగ్ హీరోలే ఒకటి రెండు సినిమాలను లైన్ లో పెట్టడానికి కష్టపడుతున్నారు. వన్ బై వన్ ఓకే గానీ.. ఒకేసారి రెండు సినిమాలు అంటే కొంచెం కష్టం అన్నట్టు సినిమాలకు సైన్ చేస్తున్నారు. కానీ రజినీకాంత్ మాత్రం ఇప్పటికీ అదే స్పీడ్ చూపిస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు రెడీ చేస్తున్నాడు. ఓ దెయ్యాల దర్శకుడితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తలైవా. 

 

రజినీకాంత్ సినిమాల్లో ఎంత ఎనర్జిటిక్ గా కనిపిస్తాడో.. స్టోరీ సెలక్షన్ లోనూ అంతే హుషారుగా ఉంటున్నాడు. కొత్త కొత్త కాంబినేషన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు పనిచేయని దర్శకులతో మూవీస్ ప్లాన్ చేస్తున్నాడు. సిరుతై శివ దర్శకత్వంలో నటిస్తోన్న అన్నాత్తే సెట్స్ లో ఉండగానే మరో రెండు ప్రాజెక్ట్స్ ఫైనల్ చేశాడు రజినీకాంత్. 

 

రజినీకాంత్ తర్వాత లోకేష్ కనగరాజ్ తో సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఖైదీ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టాడు లోకేష్. ఒక్కపాట, హీరోయిన్ లేకుండా కార్తీ కెరీర్ లో బెస్ట్ హిట్ ఇచ్చాడు. ఈ యంగ్ స్టర్ టాలెంట్ కు రజినీకాంత్ కూడా ఫిదా అయ్యాడట. తర్వాత ఈ కుర్రాడి దర్శకత్వంలో నటించాలని ఫిక్స్ అయ్యాడని, కాల్షీట్స్ కూడా ఇచ్చాడని చెబుతున్నారు. 

 

రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ తర్వాత లారెన్స్ తో సినిమా చేస్తాడట. హారర్ సినిమాలతో బాలీవుడ్ వరకు వెళ్లిన రాఘవ లారెన్స్ రీసెంట్ గా తలైవాకు ఓ స్టోరీ నెరేట్ చేశాడని ప్రచారం జరుగుతోంది. ఈ లైన్ రజినీకి బాగా నచ్చిందనీ.. లారెన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. మరి చంద్రముఖిలో దెయ్యాన్ని తరిమికొట్టిన రజినీతో ఈ భూతాల దర్శకుడు ఎలాంటి సినిమాలు చేస్తాడో చూడాలి. మొత్తానికి రజినీ కాంత్ ఈ వయసులో కూడా మంచి మంచి అవకాశాలను అందుకుంటున్నాడు. యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా వైవిధ్యమైన సినిమాలను పూనుకుంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: