చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌ మరిన్ని దేశాలకు విస్తరించింది. ఇప్పటివరకు 192 దేశాల్లోని ప్రజలు కరోనా బారిన పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా 3,41,243 మంది కరోనా బాధితులు ఉన్నారు. ఈ కరోనా ఫెక్ట్ చైనా, ఇటలీ, ఫ్రాన్స్ లో ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది.  భారత దేశంలో సైతం కరోనా ఎఫెక్ట్ వల్ల మరణాలు సంబవిస్తున్నాయి.  ఇప్పటివరకు 14,746 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో ఇటలీ ప్రజలే 5,476 మంది ఉన్నారు.చైనాలో 3,270 మంది, స్పెయిన్‌లో 1,813, ఇరాన్‌లో 1,685, ఫ్రాన్స్‌లో 674, అమెరికాలో 457 , యూకేలో 281, నెదర్లాండ్స్‌లో 179. దక్షిణకొరియాలో111,  స్విట్జర్లాండ్‌లో 98 మంది, జర్మనీలో 94 మంది ప్రాణాలు కోల్పోయారు. 

 

కరోనాను నిర్మిలించేందుకు జనతా కర్ఫ్యూ పాటించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ నేపథ్యంలో యావత్ భారత దేశం నిన్న జనతా కర్ఫ్యూ పాటించింది.  ఐదు గంటల తర్వాత బయటకు వచ్చి చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు.  అత్యవసరం అయితే తప్ప దేశ ప్రజలు ఎవరూ బయటకు రావడం లేదు. అత్యవసర సేవలు మినహా అన్నీ బంద్ అయ్యాయి. వైద్యులు, అత్యవసర సేవలు అందిస్తున్న వారికి సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలు చప్పట్లతో సంఘీభావం తెలుపనున్నారు.  ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయులు సైతం జనతా  కర్ఫ్యూకి సంఘీభావం ప్రకటించారు.

 

బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రా కూడా అమెరికాలో జనతా కర్ఫ్యూలో భాగస్వామి అయింది. తన భర్త నిక్ జొనాస్ తో కలిసి ఆమె ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంది.  తన భర్త నిక్ జొనాస్ తో కలిసి ఆమె ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంది. న్న సాయంత్రం 5 గంటలకు చప్పట్టు కొడుతూ జనతా కర్ఫ్యూ స్ఫూర్తిలో పాలుపంచుకుంది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రియాంక  తన అభిమానులతో పంచుకుంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రపంచమంతా డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలకు చప్పట్ల ద్వారా సంఘీభావం ప్రకటించి తన దేశ భక్తి చాటుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: