తెలుగు సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో ఎన్నో హిట్లు ఉన్నాయి. కొన్ని సినిమాలు మెగాస్టార్ కు కలిసొస్తాయి అనే పేరు కూడా ఉంది. అలాంటి డేట్లలో 9వ తేదీ మెగాస్టార్ కు బాగా కలిసొస్తుంది. కొండవీటి దొంగ, కొదమసింహం, జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానామొగుడు.. ఇలాంటి ఎన్నో సూపర్ హిట్లు 9న కానీ, తొమ్మిది అంకె కలిసిన డేట్లో కానీ రిలీజ్ అయ్యాయి. అలానే 23వ తేదీ కూడా మెగాస్టార్ కు బాగా కలిసొచ్చింది. మొత్తంగా 5నెంబర్ కూడా ఆయనకు లక్కీ డేట్ అనే చెప్పాలి.

IHG

 

చిరంజీవి కెరీర్లో 23న విడుదలైన సినిమాల్లో హీరో, పసివాడి ప్రాణం, స్టేట్ రౌడీ.. వంటి సినిమాలు ఉన్నాయి. వీటిలో 1984 మార్చి23న హీరో, 1989 మార్చి 23న స్టేట్ రౌడీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. హీరోకు నేటితో 36ఏళ్లు పూర్తయితే.. స్టేట్ రౌడీకి 31ఏళ్లు పూర్తయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా హిట్టయ్యాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకు విజయబాపినీడు దర్శకత్వం వహించారు. రాధిక హీరోయిన్. 1981లో వచ్చి రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ మూవీలో ఇంట్రడక్షన్ సీన్ ను యధావిధిగా హీరోలో తీశారు. అప్పట్లో ఈ సీన్ సినిమాకే హైలైట్.

IHG

 

స్టేట్ రౌడీ సినిమాను టి.సుబ్బిరామిరెడ్డి నిర్మిస్తే బి.గోపాల్ దర్శకత్వం వహించారు. రాధ, భానుప్రియ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు తొలిసారిగా హిందీ మ్యూజిక్ డైరక్టర్ బప్పీలహరి సంగీతం అందించారు. సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఆ ఏడాది అత్తకుయముడు అమ్మాయికి మొగుడు ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చింది స్టేట్ రౌడీ. 32కేంద్రాల్లో 100రోజులు ఆడింది. సినిమాలో టైటిల్ సాంగ్ పక్కా మాస్ సాంగ్ గా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: