అమృతా అయ్య‌ర్‌...త్వరలో టాలీవుడ్ కి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం కాబోతుతున్న బ్యూటి ఫుల్ హీరోయిన్‌. ఈ అమ్మడు కోలీవుడ్ స్టార్ హీరో ఇల‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ నటించిన 'బిగిల్‌' సినిమాతో బాగా పాపులర్ అయింది. ఆ సినిమా గుర్తింపుతోనే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఆక‌ట్టుకోవ‌డానికి రెడీ అయింది. '30 రోజుల్లో ప్రేమించడమెలా' అన్న సినిమాతో టాలీవుడ్ జనాలని ఆకట్టుంటానని చాలా ధీమాగా ఉంది. ఇక ఈ బ్యూటి నటించిన మొద‌టి తెలుగు సినిమా రిలీజ్ కాకుండానే మరో రెండు సినిమాలలో అవకాశం అందుకుంది అమృతా అయ్యర్. 

 

బెంగ‌ళూరుకు చెందిన అమృతా సంప్ర‌దాయ కుటుంబం నుంచి వ‌చ్చిన‌ట్టు చెప్పింంది. అంతేకాదు అమృతా కుటుంబంలో ఇప్పటి వ‌ర‌కూ సినిమా ఇండస్ట్రీలో లేకపోవడం ఆసక్తికరమైన విషయం. చదువుకునే రోజుల్లో సరదాగా మోడలింగ్‌ చేసింది. అదే సమయంలోనే మలయాళంలో సినిమా అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో విజయ్‌తో చేసిన 'బిగిల్‌' సూపర్‌ హిట్ కావ‌డంతో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. 

 

తెలుగులో త‌న‌ మొదటి సినిమా '30 రోజుల్లో ప్రేమించడమెలా'. ఈ సినిమాలో బుల్లితెర ఫేమస్ యాంకర్ ప్రదీఇ మాచి రాజు హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడే మరో రెండు సినిమాలలో ఛాన్స్ వచ్చింది. వాటిలో నాగశౌర్య కి జంటగా నటించే సినిమా. ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే మొదలు కాబోతోంది. అంతేకాదు రాం నటిస్తున్న రెడ్ సినిమాలో కూడా ఒక హీరోయిన్ గా నటిస్తుంది. అయితే సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్ పాత్రలు పోషించాలి. అందుకు నాకు ఎలాంటి అభ్యంతరాలు లేరు. వల్గారిటి లేకుండా ఉన్న అలాంటి గ్లామర్ పాత్ర అయినా ఓకే అంటూ ఇన్‌డైరెక్ట్ గా ఎక్స్‌ఫోజింగ్  చేస్తానంటు మేకర్స్ కి హింట్ ఇచ్చింది. అయితే చూడటానికి పద్దతిగా కనిపించినప్పటికి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నందుకు చాలామంది అవాక్కవుతున్నారు. అంతేకాదు బాగా లాజిక్ లను త్వరగానే తెఉసుకుందే. ఎంతైనా హీరోయిన్ అవ్వాలనుకుంటుంది కదా అని కామెంట్ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: