కరోనా వైరస్ నేపథ్యంలో దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశంలో ఉన్న ప్రజలంతా ఇంటికి పరిమితం కావడంతో అన్ని రోడ్లు దుకాణాలు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ మూతపడటం జరిగింది. దీంతో సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ప్రముఖులు ఇంటికే పరిమితం అయ్యే సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వీడియోల ద్వారా సూచనలు సలహాలు అవగాహన కల్పిస్తున్నారు. మరికొంతమంది ఎవరూ కూడా బయటకు రాకూడదు అంటే హెచ్చరికలు జారీ చేస్తూ ఇంట్లోనే జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు.

 

ఇటువంటి నేపథ్యంలో ఇండస్ట్రీలో ఉన్న సినిమా హీరోలు నీతులు చెబుతూ కోట్లు కోట్లు సంపాదించుకునే వాళ్ళు ఇంటికే పరిమితమైనా సందర్భంలో గత కొన్ని సంవత్సరాల నుండి ఒక్క హిట్ మాత్రమే చూసిన రాజశేఖర్ లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడే పేద సినిమా కార్మికులకు పది రోజులకు సరిపోయే నిత్యావసర వస్తువుల పంపిణీని ఉచితంగా చేపట్టి తాను రియల్ హీరోను అనిపించుకున్నారు.

 

చాలామంది స్టార్ హీరోలు కేవలం టీవీ యాడ్స్ లో కనబడుతూ అలా ఉండండి ఇలా ఉండండి చేతులు అలా కడుక్కోండి అంటూ సలహాలు ఇస్తూ ఉంటే...నటుడు రాజశేఖర్ మాత్రం డైలీ ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ సినిమా కార్మికుల దగ్గరకు వెళ్లి వాళ్ల బాధను అర్థం చేసుకుని నిత్యవసర వస్తువులను పంపిణీ చేయడంతో...సినీ కార్మికులంతా రాజశేఖర్ చేసిన సహాయానికి దండం పెడుతున్నారు. మమ్మల్ని బాగా అర్థం చేసుకున్నాడు...సరైన టైమ్ లో వచ్చి రాజశేఖర్ మమ్మల్ని ఆదుకున్నాడు అంటూ...ఆ సినీ కార్మికులు పేద కుటుంబాలు రాజశేఖర్ చేసిన సహాయానికి బోరున విలపిస్తున్నారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో హాట్సాఫ్ రాజశేఖర్ అంటూ దండం పెడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: