ఆలూ లేదూ చూలూ లేదు అన్నట్లుగా నందమూరి బాలక్రిష్ణ సినీ వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేస్తాడా లేదా అన్నది పెద్ద చర్చగా ఉంది. చేస్తే ఆయన ఈ పాటికే చేయాలని కూడా బాలయ్య  అభిమానులు బాధతో అంటున్న మాట ఉంది. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ నాగార్జున రెండవ కొడుకు అఖిల్ ఒకే ఏజ్ బ్యాచ్.

 

ఇక అఖిల్ మూడేళ్ళ క్రితమే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికి నాలుగవ సినిమా కూడా కంప్లీట్ చేశాడు. జోరుగా సినిమాలు చేస్తే కచ్చితంగా ఈ పాటికి అఖిల్ అరడజన్ మూవీస్ చేసే అవకాశం ఉండేది. సరే అఖిల్ హీరోగా జనాలకు పరిచయం అయ్యాడు. హీరో మెటీరియల్ ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక హిట్ పడాలంతే.

 

అదే టైంలో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞని తీసుకుంటే ఈ మధ్య కనబడిన లేటెస్ట్  పిక్స్ లో ఆయన లావుగా ఉండడంతో పాటు బొజ్జ కూడా ఎత్తుగా కనిపించింది. ఆయన వయసు చిన్నదే అయినా అంకుల్ ట్యాగ్ తో సోషల్ మీడియా ఓ ఆట ఆడేసుకుంది. ఆ తరువాత జరిగిన దాన్ని రిపేర్ చేసుకుంటూ మళ్ళీ హీరోగా మారేందుకు, స్మార్ట్ లుక్ కోసం మోక్షజ్ఞ చేయాల్సినవి అన్నీ చేస్తున్నాడని అంటున్నారు.

 

అదే సమయంలో మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం చేస్తే డైరెక్ట్ చేయాలని కుతూహలం ఉన్న డైరెక్టర్ల లిస్ట్ ఎక్కువగానే ఉంది అందులో ఇపుడు అనిల్ రావిపూడి కూడా చేరారు. ఆయన లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో తాను తప్పకుండా మోక్షజ్ఞ ని డైరెక్ట్ చేసి తీరుతానని శపధం చేసిన లెవెల్లో చెప్పుకొచ్చారు.  

 

అంతే కాదు ఓ వైపు బాలయ్య, మరో వైపు మోక్షజ్ఞలని పెట్టి మరీ మల్టీ స్టారర్ మూవీ కూడా తీస్తానని కూడా చెప్పేశాడు. మొత్తానికి అనిల్ రావిపూడి మాటలను బట్టి చూస్తూంటే మోక్షజ్ఞ అరంగేట్రం మూవీని ఆయనే టేకప్ చేసేలా ఉన్నాడని అంటున్నారు. చూడాలి మరి ఆ రోజు ఎపుడో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: