ప్రపంచ దేశాలను కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. భారత్ లో కూడా చాపకింద నీరులా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేరళలో కరోనా కేసులు సంఖ్య 90దాటింది. ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 400దాటింది.    ఈ  వైరస్ ఇతర దేశాలలో వ్యాప్తి చెందిన విధంగా మన దేశంలో కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఇప్పటికే దేశంలో మరణాల సంఖ్య 8 కి చేరుకుంది. ఇటలీ, ఇరాన్ వంటి దేశాలలో  రోజు రోజుకు రోగుల సంఖ్య పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ అనేది మనుషుల ఊపిరితిత్తుల పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. 

 

 జనతా కర్ప్యూ, నిర్భందనం వంటి చర్యల వల్ల రోగుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని రోహ్తక్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హెడ్ డాక్టర్ చౌదరి అన్నారు. ఇటలీ, ఇరాన్ వంటి దేశాల్లలోను అధిక మరణాలు సంభవించటానికి తగ్గినన్ని ఐసీయూలు లేకపోవటమే కొంతవరకు కారణమని తెలుస్తుంది.   ఈ నేపథ్యంలొ రాజకీయ, సినీ సెలబ్రెటీలు తను తాము స్వియ నిర్బందంలో ఉంచుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో సుహాసిని, మణిరత్నం దంపతుల తనయుడు నందన్ కూడా స్వీయ నిర్బంధం విధించుకున్నాడు.

 

ఇటీవలే లండన్ నుంచి వచ్చిన నందన్ ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ తర్వాత నేరుగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాడు. దీనిపై సోషల్ మీడియాలో స్పందించాడు.  నేను బయటికి రావాలంటే మరో రెండు వారాలు పడుతుంది. అప్పటివరకు ఎంత బోర్ కొట్టినా బయటికి రాను. నేను లండన్ నుంచి ఐదు రోజుల కిందట భారత్ వచ్చాను. మన చుట్టూ ఉన్నవారి కోసం మనం చేయగలిగే అత్యల్ప సాయం ఇది. ఎవరి ప్రోద్బలం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నాను  అంటూ వెల్లడించాడు.  మణిరత్నం తనయుడు మాత్రమే కాదు విదేశాల నుంచి వచ్చిన పలువురు నటులు సైతం తమను తాము స్వియ నిర్భందం చేసుకుంటున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: