కరోనా వైరస్ వల్ల చాలా మంది దేశ ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ అయిపోయాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎక్కడికక్కడ వైరస్ చైన్ కట్టడి చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో చాలా వరకు అన్ని వ్యాపార రంగాలు మూతపడ్డాయి. అత్యవసర సరుకులు అలాగే వైద్యానికి సంబంధించి మాత్రమే అందుబాటులో ఉంచారు. దీంతో చాలా వరకు ప్రజలంతా ఇంటికే పరిమితమవుతున్నారు కొంతమంది కక్కుర్తి వైఖరి కలిగిన వాళ్ళు ఇష్టానుసారంగా రోడ్లపైకి వస్తున్నారు. ఏ మాత్రం ప్రభుత్వాలు చెబుతున్న ఆదేశాలను పట్టించుకోకుండా ఆటోలు మరియు క్యాబ్‌లు తిప్పుతున్నారు.

 

దీంతో చాలా వరకు పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తాజాగా ఈ విషయంపై ప్రధాని మోడీ కూడా చాలా సీరియస్ అయ్యారు. కొన్ని రాష్ట్రాలలో జనతా కర్ఫ్యూ పాటించడంలేదని...ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా మెలగాలని సూచించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఈ విధంగా వ్యవహరిస్తే శవాలు కుప్పలుతెప్పలుగా ఇటలీ దేశంలో మాదిరిగా మారుతాయని...ఒక్కసారి ఈ వైరస్ భారతదేశంలో విరుచుకుపడితే ఇటలీ కంటే చాలా దారుణంగా భారతదేశం తయారవుతుందని...అనధికారికంగా 20 కోట్ల మంది చనిపోవడం జరుగుతుంది అని ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు ముందర ఉన్న అతి పెద్ద చాలెంజ్ లాక్ డౌన్ మాత్రమే అని...ఇది కనుక మిస్ అయింది అంట చావుల సునామి దేశంలో నెలకొంటుందని నిపుణులు చెబుతున్నారు.

 

మరోపక్క ప్రజలు ఎవరికి వారు స్వచ్ఛందంగా ఇంట్లోనే ఉంటూ రెండు వారాలు భవిష్యత్ తరాల కోసం ఆలోచించి ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తే ఖచ్చితంగా కరోనా వైరస్ దేశం నుండి వెళ్లిపోవడం గ్యారెంటీ అని అంటున్నారు చాలామంది. అసలే ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన రెండో దేశంగా భారత్ ఉండటంతో..ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ప్రభుత్వాలకు సహకరించాలని నాయకులు కోరుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: