కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటినీ ఎంతగా ఒణికిస్తుందో అందరికి తెలిసిందే. ప్రపంచమంతా ఎక్కడ చూసినా కరోనా భయంతో ప్రజలు వణికిపోతున్నారు. కరోనా ప్రభావంతో దేశంలోని సామాన్య ప్రజలతో పాటు సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీల పై కూడా విపరీతంగా ఉంది. కరోనా వల్ల రీసెంట్ గా చిత్రసీమలో షూటింగ్ జరుపుకుంటున్న చిన్న సినిమాల దగ్గర్నుంచి ఆర్.ఆర్.ఆర్ వంటి భారీ బడ్జెట్ వరకు అన్ని సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా డార్లింగ్ ప్రభాస్ కూడా తన 20వ సినిమా షూటింగ్ ఆపేసి ఇంట్లో ఉన్నాడు.

 

ఇదిలా ఉండగా.. కరోనా కారణంగా ఈ నెల 31 వరకు సినిమా థియేటర్లు కూడా మూసివేయడం అందరికి తెలిసిందే. ఈ కరోనా బారినుండి తప్పించుకోవడానికి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను లాక్ డౌన్ చేసింది. ఈ పరిస్థితిలో అసలు కరోనా పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయి.. మేం షూటింగ్ పూర్తిచేసేది ఎప్పుడు.. అన్న సందేహాలతో ప్రభాస్ చిత్రయూనిట్ ఉన్నట్లు సమాచారం. ఈ దారుణమైన పరిస్థితులు ఇలాగే గనక కంటిన్యూ అయితే దేశంలోని అన్ని సినిమాలు ఆపేసి ఇంట్లో కూర్చోవడమే ప్రస్తుతం కనిపిస్తున్న మార్గం.

 

ఈ లెక్కన చూస్తే ప్రభాస్ 20వ సినిమా ఇప్పుడప్పుడే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు కంప్లీటవవని తెలుస్తుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న ఈ సినిమా పై సినీ ప్రేక్షకులు భారీగా అంచనాలను పెట్టుకున్నారు. కానీ ఈ కరోనా ఎఫెక్ట్ తో ఈ సంవత్సరం ప్రభాస్ సినిమా రిలీజ్ అయ్యో అవకాశాలు కనిపించడం లేదని అర్థమవుతోంది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూసే అని చెప్పక తప్పడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: