కోలీవుడ్ లో సూపర్ హిట్టైన అసురన్ సినిమా రీమేక్ కు భలే ఆఫర్లు వస్తున్నాయి. ఆల్రెడీ తెలుగులో ఈ సినిమాను విక్టరీ వెంకటేష్ రీమేక్ చేస్తుండగా ఇప్పుడు ఈ సినిమా మరో భాషలో కూడా రీమేక్ అవుతుందట. కన్నడలో అసురన్ రీమేక్ కు అన్ని ఏర్పాట్లు జరిగాయట. కన్నడలో ఈ సినిమాను శివరాజ్ కుమార్ చేస్తున్నారని తెలుస్తుంది. కన్నడలో ఇలాంటి రియలిస్టిక్ సినిమాలు చేయాలంటే ఆయనే మొదటి ఆప్షన్. అందుకే అసురన్ రీమేక్ ఆఫర్ ఆయన దగ్గరకే వెళ్ళింది. 

 

తెలుగులో అసురన్ రీమేక్ ను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు తెలుగు వర్షన్ టైటిల్ గా నారప్ప అని ఫిక్స్ చేశారు. షూటింగ్ మొదలు పెట్టిన రోజే నారప్ప ఫస్ట్ లుక్ అందరిని సర్ ప్రయిజ్ చేసింది. వెంకటేష్ తన నట విశ్వరూపాన్ని ఈ సినిమాతో చూపిస్తారని తెలుస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో కలిసి పనిచేసిన శ్రీకాంత్ అడ్డాల, వెంకటేష్ మరోసారి ఈ సినిమాను కలిసి చేస్తున్నారు. తమిళంలో సెన్సేషనల్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా అదే రేంజ్ హిట్ అందుకుంటుందని అంటున్నారు. బ్రహ్మోత్సవం తర్వాత కనబడకుండా వెళ్లిన శ్రీకాంత్ అడ్డాల మళ్ళీ ఈ రీమేక్ తో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. 

 

ఇక్కడ వెంకటేష్ అక్కడ శివ రాజ్ కుమార్ అసురన్ రీమేక్ అన్ని భాషల్లో జరుగుతుంది. కన్నడ శివ రాజ్ కుమార్ నటిస్తున్న అసురన్ రీమేక్ ను జాకబ్ వేర్గెసే డైరెక్ట్ చేస్తున్నారు. తెలుగులో నారప్పగా  వస్తున్న అసురన్ కన్నడలో ఎలాంటి టైటిల్ తో వస్తుందో తెలియాల్సి ఉంది. కన్నడలో కూడా అసురన్ రీమేక్ హీరో ఎవరన్నది హాట్ న్యూస్ గా మారింది. ముందు యువ హీరోతో ఆ సినిమా చేయాలని అనుకున్న తెలుగులో వెంకటేష్ టేకప్ చేయడంతో శివ రాజ్ కుమార్ అక్కడ ఫిక్స్ చేసుకున్నారు. మొత్తానికి ఒక సూపర్ హిట్ సినిమాను రెండు భాషల్లో ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకేసారి రీమేక్ చేయడం క్రేజీ అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: