ఉగాది పండుగ వచ్చిందంటే చాలు అనేక సినిమాల విడుదల మాత్రమే కాకుండా మరెన్నో కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు టాప్ హీరోల సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ లు టీజర్ల విడుదలతో ఇండస్ట్రీలో మంచి పండుగ వాతావరణం కనిపించేది. అయితే ఇప్పుడు కరోనా దెబ్బతో సినిమాల విడుదల మాత్రమే కాదు రేపు ప్రారంభం కావలసి ఉన్న అనేక సినిమాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.


ఇలాంటి పరిస్థితులలో రాజమౌళి హడావిడి మాత్రం కనిపించబోతోంది. సుమారు 19 ఏళ్ల క్రితం ప్రసారం అయిన ఒక కామెడీ షో ‘అమృతం’ ఆరోజులలో ఒక ట్రెండ్ సెటర్ ఇప్పటికీ బుల్లితెర పై ఈ సీరియల్ అనేక సార్లు మళ్ళీ ప్రసారం అయినా ఇంకా అనేకమంది ఈ సీరియల్ ను చూస్తూనే ఉంటారు. 


ఇలాంటి సీరియల్ కు సీక్వెల్ వస్తే బాగుండును అంటూ అనేకమంది ఎదురు చూస్తున్నారు. వారందరి కోరిక ఉగాది రోజున తీరబోతోంది. అమృతం సీరియల్ సీక్వెల్ కు రంగం సిద్ధం అయింది. నేటి ట్రెండుకు తగ్గట్లు అన్నీ మార్చుకుని మరింత అప్ గ్రేడ్ అయిన ‘అమృతం’ ఈ నెల 24న ఉగాది కానుకగా జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫాంలో ఆరంభం కాబోతోంది. రాజమౌళికి సన్నిహితమైన గుణ్ణం కుటుంబమే ఈ సీరియల్‌ను కూడా తీస్తోంది. 


దీనితో ఈ సీరియల్ ను ప్రమోట్ చేస్తూ రాజమౌళి రంగంలోకి దిగి ఈ సీరియల్ ను చూడమని చెపుతూ తెలుగు ప్రేక్షకులను అభ్యర్దిస్తున్నాడు. అమృతరావుగా ఎప్పట్లాగే హర్షవర్ధన్ నటిస్తూ ఉండగా అంజి పాత్రలో గుండు హనుమంతరావు పాత్రలో ఎల్.బి. శ్రీరామ్ వచ్చి చేరాడు. ఇది ఇలా ఉండగా రేపు ఉగాది రోజున ప్రారంభం కావలసిన మహేష్ పరుశు రామ్ మూవీ నాగార్జున ‘బంగార్రాజు’ ప్రీక్వెల్ రవితేజ నక్కిన త్రినాధ్ రావ్ ల మూవీ తేజ రానాల మూవీ విక్రమ్ కుమార్ నాగాచైతన్యల మూవీలు కరోనా దెబ్బతో నిరవదికంగా వాయిదా పడటంతో మొత్తం ఇండస్ట్రీ వాతావరణం అంతా వెలవెలపోతోంది..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: