నమ్మకానికి, హిట్ ఫ్లాపులతో సంబంధం లేదు. టాలెంటెడ్.. సింక్ లో ఉన్నాడు అని నమ్మకముంటే చాలు కాంబినేషన్స్ వర్కవుట్స్ అవుతూనే ఉంటాయి. సల్మాన్ ఖాన్ ఇలాగే ప్రభు దేవాతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ప్రభుదేవాకు రెండు సినిమాలు ఇచ్చిన సల్మాన్, తర్వాత రెండు మూవీస్ కూడా ఈ దర్శకుడికే అప్పగిస్తున్నాడు. 

 

సల్మాన్ ఖాన్ ఫ్రెండ్ షిప్ మామూలుగా ఉండదు. తన కెరీర్ తో పాటు దోస్తుల కెరీర్ గురించి ఆలోచిస్తాడు. వాళ్లకు సినిమాలు ఇస్తాడు. అలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్ లో ప్రభు దేవా కూడా జాయిన్ అయ్యాడు. అందుకే ఈ దర్శకుడితో వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు సల్మాన్. ఇప్పటికే ప్రభుదేవా దర్శకత్వంలో రాధే చేస్తోన్న సల్మాన్, ఆ తర్వాతి సినిమాను కూడా ఈ డైరెక్టర్ కే అప్పగిస్తున్నాడని చెబుతున్నారు. 

 

సల్మాన్ ఖాన్ వాంటెడ్ సినిమాతో బాలీవుడ్ లోఅడుగుపెట్టాడు ప్రభుదేవా. తెలుగు హిట్ పోకిరీ రీమేక్ గా రూపొందిన ఈ మూవీతోనే సల్మాన్ గ్రాఫ్ మళ్లీ పైకి లేచింది. ఈ సిినిమా సెట్స్ లోనే భాయిజాన్ కు ప్రభుదేవాపై నమ్మకం పెరిగిపోయిందట. కమర్షియల్ యాక్షన్ మూవీస్ బాగా తీస్తాడనే గురి కుదిరిందని చెబుతున్నారు. అందుకే దబాంగ్ 3 ని ఫ్లాపులో కలిపేసినా.. ప్రభుదేవాకు టైగర్ సిరీస్ లో ఓ సినిమా ఇస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. 

 

సల్మాన్ ఖాన్ తర్వాత టైగర్ ఫ్రాంచైజీతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఏక్ థా టైగర్, టైగర్ జిందాహై సక్సెస్ ను కంటిన్యూ చేయగల బలమైన కథలు సిద్ధం చేయిస్తున్నాడు. అయితే మొదటి రెండు టైగర్స్ ను డైరెక్ట్ చేసిన కభీర్ ఖాన్, అలీ అబ్బాస్ జాఫర్ ను కాదని ప్రభుదేవాకు దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నాడట. సో సల్మాన్ ఖాన్ సపోర్ట్ చూస్తే ప్రభుదేవా బాలీవుడ్ లో ఫుల్ బిజీ డైరెక్టర్ గా మారే అవకాశముందని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: