తెలుగులో ప్రస్తుతం హీరోయిన్ల కొరత స్పష్టంగా ఏర్పడుతుంది. పెద్ద హీరోల నుండి మొదలుకుని, మీడియం రేంజ్ హీరోల వరకూ హీరోయిన్లు అస్సలు దొరకట్లేదు. ఇక సీనియర్ హీరోలకైతే మరీ కష్టం. తెలుగులో ప్రస్తుతం స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్లు ఎవరని అంటే టక్కున గుర్తొచ్చేవి రెండే పేరులు.. రష్మిక మందన్న, పూజా హెగ్డే.. వీరిద్దరూ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

 

 


అయితే స్టార్ హీరోయిన్ అనిపించుకుంటారనుకున్న చాలా మంది హీరోయిన్లు అక్కడి వరకు వెళ్ళలేక ఆగిపోయారు. కొందరేమో ఆ స్టేటస్ చాలా దూరంలో ఆగిపోతే మరికొందరు అడుగు దూరంలో ఆగిపోవడం విచిత్రం. అలా స్టార్ స్టేటస్ కి అడుగు దూరంలో ఆగిపోయిన వాళ్ళలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ భామ కొద్దిరోజుల్లోనే మంచి మంచి అవకాశాలు దక్కించుకుంది.

 

 

రామ్ చరణ్, అల్లు అర్జున్ సరసన నటించి విజయాలు కూడా దక్కించుకుంది. నటనలోనే కాదు గ్లామర్ ని ఒలకబోయడంలోనూ తాను ముందుంది. అయితే స్టార్ హీరోయిన్ గా మాత్రం అనిపించుకోలేకపోయింది. ప్రస్తుతం రకుల్ కి తెలుగులో ఆఫర్లే లేవు. దే దే ప్యార్ దే అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అక్కడ కూడా ఆమెకి అవకాశాలు రాలేదు.

 

 

అదీ కాకుండా సీనియర్ హీరోలతో మాత్రమే ఛాన్స్ రావడం ఆమె పట్ల శాపంగా మారింది. తెలుగులో మన్మధుడు ౨ సినిమాలో నాగార్జున సరసన నటించిన తర్వాత ఒక్క ఆఫర్ కూడా రాకపోవడం చూస్తుంటే సీనియర్ హీరోల సరసన నటించడం ఆమెకి ఎంత నష్టాన్ని కలిగించిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ సరసన థ్యాంక్యూ గాడ్ అనే హిందీ చిత్రంలో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: