బాలీవుడ్‌ హాట్ హీరోయిన్‌ వాణీకపూర్‌ వార్‌, బేఫికర్ సినిమాల్లో తన డాన్సింగ్‌ స్కిల్స్‌తోనూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ భామ చాక్లెట్ భాయ్‌ రణబీర్‌ కపూర్‌ తో కలిసి షంషేర్‌ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె తొలిసారిగా పర్ఫామెన్స్‌కు స్కోప్‌ ఉన్న సినిమాలో నటించనుంది. `నేను ఒక విషయాన్ని బలంగా నమ్ముతాను. నటులుగా ఉన్నవారు ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని, ఇండస్ట్రీ నాకు చాలా సార్లు ప్రూవ్ చేసుకునే అవకాశం ఇచ్చింది` అని చెప్పింది.

 

ఈ సందర్భంగా ఆమె తన డాన్సింగ్ స్కిల్స్ గురించి చెప్పింది. `నేను నిజంగా చెపుతున్న. నేను ఇండస్ట్రీలోకి వచ్చే ముందు ఎప్పుడు డ్యాన్స్ విషయంలో ట్రైనింగ్ తీసుకోలేదు. మాధురి దీక్షిత్‌, శ్రీదేవి లాంటి ఎంతో మందిని చూసి ఇన్స్‌పైర్‌ అయ్యి నేను డాన్స్ నేర్చుకున్నా. నేను కేవలం ఓ తరహా పాత్రలు మాత్రమే కాదు అన్ని రకాల పాత్రలు చేయాలని భావిస్తున్నా. అందుకోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నా. నన్ను నేను ముందు వరుసలో చూసుకునేందుకు చాలా శ్రమిస్తున్నా` అంటోంది వాణీ.

 

ప్రస్తుతం ఆమె నటిస్తున్న షంషేర్ సినిమాకు సంబంధించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `ఈ సినిమాలో నేను పర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో నటిస్తున్నాను. నాకు సినిమాలో మంచి పాటలకు డ్యాన్స్ చేసే అవకాశం లభించింది.ఈ మూవీలోని అన్ని పాటలు సూపర్‌ హిట్ అవుతాయన్ననమ్మకం ఉంది` అంటోంది వాణీకపూర్‌.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

@bridestodayin

A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) on

మరింత సమాచారం తెలుసుకోండి: