మెగా మేనళ్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. మైత్రి మూవీస్, సుకుమార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను సుక్కు అసిస్టెంట్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమాలో విలన్ గా తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుంది. సినిమా నుండి వచ్చిన రెండు సాంగ్స్ తోనే పాజిటివ్ బజ్ ఏర్పడేలా చేశారు. రిలీజైన సాంగ్స్ లో హీరోయిన్ కృతి శెట్టి క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కు ప్రేక్షకులే కాదు దర్శక నిర్మాతలు కూడా ఫిదా అవుతున్నారు. అందుకే ఆమె మొదటి సినిమా రిలీజ్ కాకుండానే వరుస ఛాన్సులు ఇస్తున్నారు. 

 

ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్ లో వస్తున్న నిఖిల్ 18 పేజెస్ సినిమాలో కూడదా కృతిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే కాకుండా యువ హీరో విశ్వక్ సేన్ నటించే పాగల్ సినిమాలో కూడా కృతి శెట్టి లక్కీ ఛాన్స్ పట్టేసింది అంటున్నారు. రీసెంట్ గా హిట్ తో హిట్ అందుకున్న విశ్వక్ సేన్ పాగల్ అంటూ రాబోతున్నాడు. రీసెంట్ గా ముహూర్త కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. 

 

ఈ మూవీలో కృతి శెట్టితో పాటుగా సిమ్రాన్ కౌర్ కూడా ఒక హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఆల్రెడీ విశ్వక్ సేన్ నటించిన ఈనగరానికి ఏమైంది సినిమాలో సిమ్రాన్ కౌర్ విశ్వక్ సేన్ కలిసి నటించారు. ఈ ఇద్దరు కలిసి చేస్తున్న రెండో సినిమాగా పాగల్ వస్తుంది. మరి విశ్వక్ సేన్ చేయబోతున్న పాగల్ మూవీ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి. కెరియర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న విశ్వక్ సేన్ యువ హీరోల్లో సత్తా చాటేలా ఉన్నాడు. పాగల్ తో పాటుగా నెక్స్ట్ ఇయర్ హిట్ 2తో కూడా సర్ ప్రయిజ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు విశ్వక్ సేన్. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: