నందమూరి బాలక్రిష్ణ మూవీ రూలర్ తన అభిమానులని తీవ్రంగా  నిరాశ పర్చింది. కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పాతకాలపు కథలా ఉందని, అస్సలు కొత్తదనం లేదని, ఇంకా ఇలాంటి సినిమాలు బాలయ్య ఎందుకు తీస్తున్నాడంటూ ఆయన అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతే కాదు ఈ సినిమాలో బాలయ్య లుక్ మీద అనేక ట్రోలింగ్స్ జరిగాయి. పోలీస్ ఆఫీసరుగా బాలయ్య లుక్ అస్సలు బాలేదంటూ సోషల్ మిడియాలో పోస్టులు పెట్టారు.

 

 

 


అయితే వాటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న బాలయ్య తన తర్వాతి చిత్రంలో అలాంటి పొరపాట్లు చేయకూడదని ఫిక్స్ అయ్యాడట. బాలయ్య బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలా ఉండకూదని కొత్తదనం కనిపించాలని తహతహలాడుతున్నాడట. దర్శకుడు బోయపాటికి కూడా స్క్రిప్ట్ లో కొత్తదనం కనిపించేలా ఉండాలని చెబుతున్నాడట.

 

 

ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా కనిపిస్తాడట. ఆ గెటప్ కోసం బాలయ్య గుండు కొట్టించుకున్నాడట. బాలయ్య గుండు లుక్ కి ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలే దక్కాయి. బోయపాటి సినిమా అంటే మాస్ ఫైట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. కానీ అలాంటి ఫైట్సే బోయపాటికి వినయ విధేయ రామ రూపంలో ఘోర డిజాస్టర్ ని తెచ్చిపెట్టింది. అందుకనీ బాలయ్యతో చేసే సినిమాలో అలాంటి మరీ మాస్ సన్నివేశాలు ఉండవట.

 


ఆద్యంతం కొత్తగా కనబడేలా ఉండే సీన్లే ఈ సినిమాలో ఉంటాయని చెబుతున్నారు. బాలక్రిష్ణ సినిమా అంటే అభిమానుల కోసమే అన్నట్లుగా కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. టీజర్, ట్రైలర్ లాంటివి రిలీజ్ అయితే కానీ తెలియదు బాలయ్య ఎంత కొత్తగా వస్తున్నాడో..!

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: