ఇన్నాళ్లుగా జరుగుతోన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు ప్రభాస్. రకరకాలుగా జరుగుతోన్న చర్చలకు ఓ క్లారిటీ ఇవ్వబోతున్నాడు. అభిమానులను కన్ ఫ్యూజ్ చేస్తోన్న వార్తలకు ఆన్సర్ ఇచ్చేందుకు డేట్ లాక్ చేసుకున్నాడు. ఉగాది నాడు అన్ని సందేహాలకు సమాధానం ఇవ్వబోతున్నాడట డార్లింగ్. 

 

ప్రభాస్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వారియర్ లుక్ నుంచి లవర్ బాయ్ గా మారిన డార్లింగ్ ని చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి ఎలాంటి లుక్ రిలీజ్ చేయలేదు. టైటిల్ విషయంలోనూ సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడా రహస్యాలని రివీల్ చేసేందుకు రెడీ అయ్యాడు ప్రభాస్. 

 

బాహుబలిలో వారియర్ గా, సాహోలో యాక్షన్ హీరోగా నటించాడు ప్రభాస్. అయితే బ్యాక్ టు బ్యాక్ సీరియస్ స్టోరీస్ లోనే నటించిన ప్రభాస్, ఇప్పుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ స్టోరీ చేస్తున్నాడు. కత్తులు పక్కనపెట్టి, రెడ్ రోజెస్ తో తిరగడానికి లుక్ కూడా మార్చుకున్నాడు. 1970లలో బ్యాక్ డ్రాప్ వస్తోన్న ఈ వింటేజ్ లవ్ స్టోరీలో పూజాహెగ్డేతో కలిసి డ్యూయెట్స్ పాడుకుంటున్నాడు ప్రభాస్. 

 

ఎనౌన్స్ మెంట్ తోనే భారీ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని ఉగాదికి రిలీజ్ చేయాలనుకుంటున్నాడు ప్రభాస్. రీసెంట్ గానే జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకొచ్చిన దర్శకుడు, ఫస్ట్ లుక్ పోస్టర్ ని డిజైన్ చేస్తున్నాడు.  ఈ లుక్ తో పాటు టైటిల్ ను కూడా రివీల్ చేస్తారట. సో ఈ సినిమా టైటిల్ అంటూ ప్రచారం జరుగుతోన్న జాన్, ఓడియర్ పైనా ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. మొత్తానికి ఇన్నాళ్లుగా జరుగుతోన్నప్రచారానికి యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్ ఫుల్ స్టార్ పెట్టబోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: