పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నానని చెప్పినప్పటి నుండి అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. ఒక సినిమా తర్వాత మరో సినిమా అంటూ మొత్తంగా మూడు సినిమాల్ని ప్రకటించాడు. అందులో మొదటిది వకీల్ సాబ్. బాలీవుడ్ పింక్ సినిమాని తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఎమ్ సీ ఏ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

 

 

ఇందులో కథానాయికగా శృతిహాసన్ ని తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయినప్పటి నుండి వకీల్ సాబ్ చిత్రంపై అంచనాలు బాగా పెరిగాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రంతో పాటు క్రిష్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అనధికారికంగా రివీల్ అయిన టైటిల్ విరూపాక్ష పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పీరియాడికల్ డ్రామాగా రూపొందుతుందట.

 

 

ఔరంగజేబు కాలం నాటి పరిస్థితులను ఈ సినిమాలో చూపించనున్నారట. పవన్ కళ్యాణ్ అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా కనిపిస్తాడట. అయితే ఈ సినిమా ద్వారా క్రిష్ పవన్ అభిమానులని సంతృప్తి పరచగలడా అనే సందేహం కలుగుతుంది. ఇటీవల ఈ చిత్రం నుండి లీకైన పవన్ పోస్టర్ చూసినప్పటి నుండి ఈ సందేహం మరింత ఎక్కువ అయింది.

 

 

ఈ లుక్ కి అభిమానుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. బందిపోటు దొంగగా పవన్ అభిమానులు ఊహించుకున్న దానికి ఆ లుక్ ఏమాత్రం సంతృప్తిని ఇవ్వలేదు. అయితే అది జస్ట్ లీకైన చిత్రమే అని, అసలు సిసలు లుక్ వేరే ఉందని, అది ఏమాత్రం పవన్ ఫ్యాన్స్ ని నిరుత్సాహ పరచదని అంటున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: