కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న పరిస్థితులలో దీని ప్రభావం అన్ని రంగాలతో పాటు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ పై కూడ పడింది. ప్రస్తుతం ధియేటర్లు మూతపడిపోయి షూటింగ్ లు ఆగిన నేపధ్యంలో కొన్ని వేలకోట్ల స్థాయిలో ఇండస్ట్రీకి నష్టాలు వస్తాయి అన్న అంచనాలు వస్తున్నాయి. తిరిగి ధియేటర్లు తెరుచుకుని షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితులలో ఫిలిం ఇండస్ట్రీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. 


ప్రస్తుతం ఈ కరోనా విపత్ గురించి టాప్ హీరోలు జనం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వీడియోలు విడుదల చేసి ఆతరువాత ప్రస్తుతం తమ కుటుంబ సభ్యులతో కాలం గడుపుతూ భవిష్యత్ లో వారు నటించబోయే సినిమా ప్రాజెక్ట్ లకు సంబంధించిన కథలు వింటున్నారు. ఈ పరిస్థితులలో నితిన్ ఒక అడుగు ముందుకు వేసి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో 10 లక్షలు విరాళం ఇచ్చి కోవిడ్-19 ప్రమాద నివారణకు ప్రభుత్వాలు చేస్తున్న సహాయ కార్యక్రమాలకు తన వంతు సహకారం ప్రకటించాడు. 


ఇప్పుడు ఈవార్త నితిన్ అభిమానుల మధ్య వైరల్ గా మారడంతో వారంతా టాప్ హీరోలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. తాము నటించే సినిమాలకు 20 కోట్ల నుండి 40 కోట్ల వరకు పారితోషికాలు లాభాలలో వాటా తీసుకుని టాప్ హీరోలు కనీసం తమ సంపాదనలో కోటి రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వలేరా అంటూ నితిన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 


సినిమాలలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయిన రాజశేఖర్ లాంటి సెలెబ్రెటీలు కరోనా సమస్య వల్ల షూటింగ్ లు ఆగిపోయి ఆకలి బాధతో అలమటిస్తున్న ఎక్స్ ట్రా ఆర్టిస్టుల కోసం ఆర్ధిక సహాయం చేస్తే ఆ విషయాన్ని కూడ పట్టించుకోని టాప్ హీరోలు కనీసం నితిన్ ని చూసి అయినా మారండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయాలను పట్టించుకునే ఖాళీ లేని మన టాప్ హీరోలు మాత్రం తమ లుక్ ఎక్కడా పాడైపోకుండా గంటల తరబడి తమ ఇంటిలోని జిమ్ లో ఎక్స్ సైజ్ లు చేస్తూ తమ మొఖం లోని గ్లో తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు..    

మరింత సమాచారం తెలుసుకోండి: