కన్నడ నాట మరో విషాదం చోటు చేసుకుంది.   కన్నడ చిత్ర రంగానికి చెందిన నిర్మాత, పారిశ్రామిక వేత్త మోహన్‌ అలియాస్‌ కపాలి మోహన్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గంగమ్మగుడి పీఎస్ పరిధిలోని బసవేశ్వర కె.ఎస్‌.ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో ఫ్యాన్‌కు ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కన్నడ పరిశ్రమతో సత్సంబంధాలు కలిగిన ఆయన బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపుతోంది. ఆయన మరణానికి గల కాణాలు ఆర్థిక సమస్యలే అయి ఉండొచ్చని అంటున్నారు.  స్నేహితుడితో కలిసి భోజనం చేసిన ఆయన అర్ధరాత్రి తర్వాత కుమారుడికి ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడించారు.

 

బసవేశ్వర కేఎస్ ఆర్టీసీ బస్టాండు వద్ద సింగిల్ బిడ్ టెండరు తీసుకుని కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టానని, దీనివల్ల దారుణంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అందరితో కలివిడిగా ఉండే మోహన్ ఇలా ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడం పై కన్నడ సినీ పరిశ్రమ ఒక్కసారే షాక్ కి గురైంది.  అప్పుల ఊబిలో కూరుకుపోయి అద్దె చెల్లించలేని పరిస్థితికి చేరుకున్నానని పేర్కొన్నారు.బ్యాంకులు తన ఆస్తుల్ని జప్తు చేశాయని, అన్నింటినీ కోల్పోయానని, పూర్తిగా ఓడిపోయానని కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తనకు న్యాయం చేస్తారని భావిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు.  

 

ఇటీవల రాజప్రస్థానం మైదానంలో మోహన్ తన కుమార్తె వివాహాన్ని వైభవంగా నిర్వహించారు.  2018లో సీసీబీ, 2019లో ఐటీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. మోహన్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కన్నడ పరిశ్రమతో సత్సంబంధాలు కలిగిన ఆయన బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపుతోంది.  సమస్యలు ఉంటే పదిమందితో షేరు చేసుకొని దానికి ఏదైనా తరుణోపాయం ఆలోచించాలి.. కానీ ఇలా ఆత్మహత్య చేసుకోవడం విషాదకరమని కన్నడ సినీ ప్రముఖులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: