విశ్వక్ సేన్..'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా పరిచయమై, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ డిఫరెంట్ స్టైల్ యాక్టింగ్ తో యూత్ కి బాగా దగ్గరయ్యారు. ఈ చిత్ర విజయం తర్వాత దర్శకుడిగా అవతారమెత్తి 'ఫలక్ నామా దాస్' చిత్రాన్ని నిర్మించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవ‌ల విడుద‌లైన 'హిట్' చిత్రంలో ఇన్స్పెక్టర్ విక్రమ్ రుద్రరాజు పాత్ర పోషించిన విశ్వక్ సేన్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరించాడు. యూత్ లో విశ్వక్ సేన్ కి ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అయితే సినిమాలతోనే కాకుండా తన వ్యవహార శైలితో ఎప్పుడూ వార్తల్లో నిలవడం విశ్వక్ సేన్ కి కొత్తేమీ కాదు. 'ఫలక్ నుమా దాస్' చిత్ర సమయంలో విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఇలాంటి వాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. కానీ అప్పుడు తిట్టుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. అదే డిఫరెన్స్.

వివరాల్లోకి వెళ్తే కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రజానీకాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్  వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ 'జనతా కర్ఫ్యూ'కి పిలుపునిచ్చారు. సామాన్య ప్రజానీకం దగ్గర నుంచి పొలిటీషన్స్ సెలెబ్రెటీల వరకు ఈ జనతా కర్ఫ్యూలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేసారు. మన కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిర్విరామంగా కృషి చేస్తున్న డాక్టర్స్ కి, పోలీసులకు, నర్సులకు మరియు మీడియా ప్రతినిధులకు సాయంత్రం 5 గంటలకు బయటకి వచ్చి క్లాప్స్ కొడుతూ కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే సాయంత్రం అందరూ చప్పట్లు కొడుతూ గుంపులు గుంపులుగా బయటకి రావడంతో జనతా కర్ఫ్యూ కి అర్థం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే విశ్వక్ సేన్ స్పందించి వారిపై ఘాటు వ్యాఖ్యలు చేసాడు. గుంపులు గుంపులుగా చేరి వీళ్లంతా కరోనాకి మందు కనిపెడుతున్నారా అంటూ ఫైర్ అయ్యారు. జనాలకి నెత్తిలో రెండు నరాలు కట్ అయ్యాయని, మీకు దిమాక్ లేదు రా బై అంటూ కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయింది.

ఇదిలా వుండగా ఫలక్ నామా దాస్ మరియు హిట్ సినిమాలు సక్సెస్ అవడంతో విశ్వక్ సేన్ మార్కెట్ బాగా పెరిగింది. ఈ నేప‌థ్యంలో ఆచితూచి క‌థ‌ల‌ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నరేష్ కొప్పల్లి అనే కొత్త దర్శకుడితో 'పాగల్' అనే సినిమాలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: