పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్ హీరోగా రొమాంటిక్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ అందించిన కథతో అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ లుక్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇంకా ఈ సినిమా రిలీజ్ అవకుండానే కేతికాకి మరో ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.

 

కేతిక శర్మకి రొమాంటిక్ లో అవకాశం దక్కినప్పటి నుండి సోషల్ మీడియాలో హాట్ హాట్ చిత్రాలతో హీటెక్కిస్తుంది. అయితే కుర్రకారుని అంతలా హీట్ ఎక్కిస్తున్న ఈ భామకి టాలీవుడ్ లో ఆఫర్లు వెల్లువలా వచ్చిపడుతున్నాయట.
అశ్వద్ధామ చిత్రంతో ఫ్లాపుని మూటగట్టుకుని మరో కొత్త చిత్రంలో హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాలో కేతికాని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట. 

 


అంతే కాదు ఈ అమ్మడుకి మరో అవకాశం కూడా వచ్చిందని అంటున్నారు. అల వైకుంఠపురములో చిత్రంలో ఒకానొక పాత్రలో మెరిసిన సుశాంత్ హీరోగా చేస్తున్న కొత్త చిత్రంలో కేతికాని తీసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే బన్నీతో ఆహా యాప్ కి సంబంధించిన యాడ్ లో నటించినట్టు చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే ముందు ముందు తెలుగులో కేతికాకి మంచి డిమాండ్ ఉండేలా కనబడుతుంది. 

 

 

నటనతో పాటు గ్లామర్ కూడా తోడవడంతో కేతికాకి అవకాశాలు వస్తున్నాయి. మొదటి సినిమా రిలీజ్ అవకముందే చేతిలో రెండు మూడు సినిమాలతో దూసుకుపోతుంటే ఇక సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే గనక ఆమెని ఆపేవారే ఉండరని అంటున్నారు. సినిమా రిలీజ్ అవకముందే ఇంతలా ఆఫర్లు తెచ్చుకుంటున్న ఈ భామకి సొషల్ మీడియాలో ఫాలోవర్లు రోజు రోజుకీ పెరుగుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: