ప్రపంచం మొత్తం కరోనా వైరస్ భయంతో వణికిపోతోంది. రోజురోజుకు తీవ్రత పెరుగుతుందే తప్ప అదుపులోకి వస్తోందన్న వార్తే వినిపించటం లేదు. వ్యాధి నియంత్రణలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 22న స్వచ్ఛంద కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ఈ పిలుపు ఎంతో సక్సెస్ కావడంతో పాటు ఆరోజు సాయంత్రం 5గంటలకు ఇళ్ల బయటకు వచ్చి ప్రజా సేవలో నిమగ్నమైన డాక్టర్లకు, వైద్య సిబ్బందికి, స్వచ్ఛ కార్మికులకు, పోలీసులకు.. మద్దతుగా చప్పట్లు కొట్టి సంఘీభావం తెలపాలని సూచించారు.

 

 

దీనికి కూడా ఎంతో అద్భుత స్పందన వచ్చింది. ఎంతో మంది సినీ సెలబ్రిటీలు తాము చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపిన వీడియోలు బయటకు వచ్చాయి. అందరితో పాటు మేము అనే అద్భుత సంకేతాలు ఇచ్చింది. చిరంజీవి, పవన్ కల్యాణ్, మోహన్ బాబు, రామ్ చరణ్, వరుణ్, ఎన్టీఆర్, అలు అర్జున్, వెంకటేశ్, పూరి జగన్నాధ్.. వంటి కొంతమంది సెలబ్రిటీలు చప్పట్లు కొట్టిన వీడియోలు బయటకు వచ్చాయి. నాగార్జున, మహేశ్, బాలకృష్ణ, అఖిల్, నాగచైతన్య, సమంత, విజయ్ దేవరకొండ, ప్రభాస్.. వంటి సెలబ్రిటీలు ఎటువంటి వీడియోలో కూడా కనిపించలేదు. ఇందుకు కారణాలు తెలియలేదు. క్లాప్స్ కొట్టినా బయటకు రాలేదా.. వీడియో క్లిప్స్ తీయలేదా అనేది తెలియరాలేదు.

 

 

నాగార్జున, విజయ్ దేవరకొండ, మహేశ్.. కరోనా వైరస్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు కానీ చప్పట్లు కొట్టి సంఘీభావం తెలపలేదు. సినీ సెలబ్రిటీలను విపరీతంగా ఆరాధించే మనకు వీరు తెలిపే మద్దతుకు అభిమానులు, ప్రేక్షకులకు స్ఫూర్తిని ఇస్తుంది. సోషల్ మీడియాలో జాగ్రత్తలు చెప్పిన వీరు క్లాప్స్ కొట్టిన వీడియోలు అదే సోషల్ మీడియాలో ఎందుకు రిలీజ్ చేయలేదో తెలియలేదు. ఈ మహమ్మారిని తరిమేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నాయి. దేశంలోని 13 రాష్ట్రాల్లో లాక్ డౌన్ కూడా ప్రకటించాయి.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: