ఇప్పటికే ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ధాటికి ప్రజల తో పాటు ప్రభుత్వాలు కూడా బెంబేలెత్తుతున్నాయి. వ్యాధి యొక్క తీవ్రత మరింతగా ప్రభలకుండా ఎక్కడికక్కడ పలు దేశాలు, లాకౌట్ లు ప్రకటిస్తూ ప్రజలను పూర్తిగా తమ ఇళ్లకే పరిమితం చేసేలా కఠిన చర్యలు తీసుకుంటోంది. ముందుగా అత్యధికంగా చైనాలో ఈ వ్యాధి ప్రభలడంతో అక్కడి ప్రభుత్వం వెంటనే మేల్కొని, ప్రజలను వెంటనే ఇళ్లకు పరిమితం చేయడంతో ప్రస్తుతం అక్కడ వ్యాధి తీవ్రత కొంత తగ్గింది. మరోవైపు ఇటలీలో ఈ మహమ్మారి తన పంజాని బలంగా విసురుతుండడంతో అక్కడి ప్రభుత్వం కూడా వ్యాధిని అరికట్టేలా గట్టిగా చర్యలు చేపట్టింది. 

 

ఇక మన భారత దేశంలో కూడా దాదాపుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాకౌట్లు ప్రకటించి ప్రజలను పూర్తిగా ఇళ్లకు పరిమితం చేసాయి. అయితే కరోనా ప్రభావంతో ఇప్పటికే చాలా మంది ప్రజలు కొన్నాళ్లుగా తమ వృత్తులు కొనసాగించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధి ప్రబావంతో పలు సంస్థలు, కార్యాలయాలు వ్యాపార సమూహాలు మూత పడడంతో ఆర్ధికంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాల వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

 

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పెద్ద వర్గాల వారికి ఉచిత రేషన్ తో పాటు కొంత భృతిని ప్రకటించగా, పలువురు ప్రముఖులు తమవంతుగా ప్రజలకు సాయమందిస్తున్నారు. మన టాలీవుడ్ లో ప్రకాష్ రాజ్, హీరో రాజశేఖర్, మంచు మనోజ్, నితిన్ వంటి వారు తమవంతుగా సాయమందించగా, తమిళ నాట నిన్న సూర్య, కార్తీ సోదరులు కలిసి పది లక్షలు సినీ కార్మికులకు వేతనంగా అందించగా, నేడు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఏకంగా యాభై లక్షల రూపాయలను సినీ కార్మికుల వేతనాల కోసం విరాళంగా అందించి మరొక్కసారి తాను నిజమైన మనసున్న సూపర్ స్టార్ గా మంచి ప్రశంసలు అందుకుంటున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: