ఇప్పటికే కరోనా వ్యాధి ఎఫెక్ట్ తో చాలా వరకు దేశాల్లోని పలు రంగాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ఇండస్ట్రీల్లో పలు సినిమాల షూటింగ్స్ పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అలానే దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ సినిమా థియేటర్స్ కూడా మూత పడ్డాయి. ఈ మహమ్మారి ఎఫెక్ట్ ఒకరకంగా మన టాలీవుడ్ లోని కొన్ని సినిమాలపై కూడా బాగానే పడిందని చెప్పాలి. సరిగ్గా అదే సమయంలో రిలీజ్ అయిన కొన్ని సినిమాల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. 

 

ఇక అదే సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా యువ దర్శకుడు చందు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఓ పిట్ట కథ, ఈనెల 6న రిలీజ్ అయి, ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టింది. కేరింత సినిమాలో నటించిన యువ నటుడు విస్వంత్ ఇందులో ఒక కీలక పాత్రలో నటించగా, కొన్నేళ్ల క్రితం దేవుళ్ళు సినిమాల బాలనటిగా నటించిన నిత్యా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఆకట్టుకునే కథ, కథనాలతో మంచి రసవత్తరంగా తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి రోజు నుండి మంచి స్పందన లభించింది. మరీ ముఖ్యంగా సినిమాలో చివరి నలభై నిమిషాల్లో వచ్చే వరుస సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. 

 

అయితే ఈ మహమ్మారి కరోనా దెబ్బకి రిలీజ్ అయి కేవలం వారం రోజులు కూడా గడవక ముందే ఈ సినిమాకు తీవ్ర సమస్యలు వచ్చి పడ్డాయి. దానితో ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కి రావడం మానేశారు. అయితే ఎట్టకేలకు తమ సినిమాని ప్రేక్షకులకు ఎలాగైనా చేరువ చేయాలని భావించిన యూనిట్, ఇటీవల ఈ సినిమాని ప్రముఖ డిజిటల్ మీడియా మాధ్యమం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి తీసుకురాగా, ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం ఈ ఒక్కసినిమాపైనే కాదు, దాదాపుగా ప్రపంచ సినిమా పరిశ్రమ మొత్తం కూడా ఈ కరోనా ఎఫెక్ట్ దెబ్బకు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: