కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదలై 12 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల చందమామ. ఇప్పటికీ వరుస సినిమాలతో అదరగొడుతోనే ఉంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడుకి ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఫోటోలలో వానవిల్లులా ఉన్న చందమామను చూసి కుర్రాళ్ల మతులు చెడిపోతున్నాయి. ముఖ్యంగా ఈ అమ్మడు ఫుల్ గ్లామర్ పోజులతో తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. చూపులతోనే చంపేసే ఈ అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ కి ప్రస్తుతం 34 ఎల్లంటే ఎవరైనా నమ్ముతారా..? తాజాగా మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఈ అమ్మడు మైనపు బొమ్మ కొలువు తీరిన విషయం తెలిసిందే.

లక్ష్మీ కళ్యాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. మగధీర, చందమామ , ఆర్య 2, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాల ద్వారా తెలుగు అభిమానులకు బాగా దగ్గరైపోయింది. అప్పటి నుండి కాజల్ కి వెనక్కి తిరిగి చూసే అవకాశం రాలేదు. ప్రతీ సినిమాలో తన అందాలతో ఫ్యాన్స్ లో వేడిపుట్టిస్తూనే ఉంది. తాజాగా కాజల్ సెక్సీ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. జనతా కర్ఫ్యూ కారణంగా సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలోనే అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కాజల్ కూడా కొన్ని పోస్టులు పెట్టి అభిమానులను ఉత్సాహపరిచింది.  

కాజల్ ప్రస్తుతం కమలహాసన్ సరసన 'భారతీయుడు-2', మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'ఆచార్య' సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ తో కలిసి మరోసారి స్టెప్పులేయనున్న ఈ అమ్మడికి మరో హిట్ పక్కా అంటున్నారు. దీంతోపాటు మంచు విష్ణుతో కలిసి 'మోసగాళ్ళు' అనే పాన్ ఇండియా మూవీలో కూడా కనిపించనుంది. చాలా గ్యాప్ తర్వాత వరుస సినిమాలలో నటిస్తున్న ఆ అమ్మడు మళ్లీ ట్రాక్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: