టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల్లో వెంక‌టేష్ ఎప్ప‌టి నుంచో ఉన్న హీరో. మెగాస్టార్ చిరంజీవి ఆయ‌న సొంత బ్యాన‌ర్‌లో సినిమాలు చేయ‌డం వ‌ల్ల ఆయ‌న ఫ్యాన్స్ ఎవ్వ‌రూ కూడా ఆయ‌న పారితోష‌యం గురించి పెద్ద‌గా ఆలోచించ‌డం లేదు. బాలకృష్ణ విషయానికే వస్తే ఇటీవల ఆయన తన పారితోషికాన్ని పెంచేశారు. ఒక్కో సినిమాకి తొమ్మిది నుంచి పది కోట్ల వరకూ తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఆయ‌న సినిమాలు హిట్ కాన‌ప్ప‌టికీ ఆయ‌న డిమాండ్ మాత్రం ఎక్క‌డా త‌గ్గించ‌లేదు. అయితే ఇటీవ‌లె విడుద‌లైన రూల‌ర్ చిత్రం పెద్ద క‌లెక్ష‌న్లు రాకపోవ‌డంతో ఆయ‌న రెమ్యూన‌రేష‌న్ నుంచి కొంత డ‌బ్బు తిరిగి ఇచ్చిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ సినిమాలు కొనే బ‌య్య‌ర్లు త‌క్కువ‌య్యారనే చెప్పాలి. ప్ర‌స్తుతం ఆయ‌న బోయ‌పాటితో క‌లిసి ఒక చిత్రం చేస్తున్నారు.

 

ఇక తాజాగా వెంకటేశ్ కూడా తన పారితోషికాన్ని పెంచేసినట్టుగా తెలుస్తోంది. ఎఫ్ 2 చిత్రం సూప‌ర్‌డూప‌ర్ హిట్ కొట్టింది. ఆ త‌ర్వాత చేసిన వెంకీమామ కూడా ప‌ర్వాలేద‌నిపించుకుంది. మ‌రి వెంకీ ఎప్ప‌టి నుంచో సోలో హీరో కంటే కూడా కాంబినేష‌న్‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. కాంబినేష‌న్‌లో క‌నిపించిన‌ప్ప‌టికీ వెంకీ డిమాండ్ బాగానే ఉంద‌ని చెప్పాలి. ఎంతైన సీనియ‌ర హీరో సీనియ‌రే క‌దా. ఇక  'ఎఫ్ 3' సినిమాకి ఆయన 10 కోట్లను డిమాండ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

 

అయితే 'దిల్' రాజుతో వున్న సాన్నిహిత్యం కారణంగా, ఆల్రెడీ 'ఎఫ్ 2' సక్సెస్ ఇచ్చినందువలన కొంత తగ్గినట్టు చెబుతున్నారు. ఆ తరువాత సినిమా నుంచి మాత్రం ఆయన 10 కోట్లకి తగ్గకూడదనే ఉద్దేశంతో వున్నారని అంటున్నారు. ఒకటి రెండు హిట్లు పడితే నాగార్జున కూడా తన పారితోషికాన్ని పెంచే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. అయితే సోగ్గాడే చిన్ని నాయ‌నా త‌ర్వాత మ‌న్మ‌థుడు 2 ఆయ‌న‌కి ఫ్లాప్ టాక్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం వైల్డ్ డాగ్ లో నాగ్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: