సినీ పరిశ్రమలో ఉన్న చాలా మంది నటులకు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు ఉన్న విషయం తెలిసిందే.  అప్ కమింగ్ హీరో, హీరోయిన్లకు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలతో తమ ఫ్యాన్స్ తో డైరెక్ట్ గా చిట్ చాట్ చేసుకునే అవకాశం ఉంటుంది.  ఇప్పటి వరకు స్టార్ హీరోలకు సోషల్ మాద్యమాల్లో ఖాతాలు ఉన్నాయి.  తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన అభిప్రాయాలను మరింత బలంగా వినిపించడం కోసం సోషల్ మీడియాలోకి అడుగుపెడుతున్నారు.  ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన సోషల్ మీడియా అకౌంట్స్‌ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌కు సంబంధించిన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో వీడియో ద్వారా తెలియజేశారు. 

 

చిరంజీవి ఇప్పటి వరకు తన అభిప్రాయాలను వీడియో రూపంలో ప్రెస్ రిలీజ్ చేస్తూ వస్తున్న సంగతి తెల్సిందే. ‘నా భావాలను నా అభిమానులతో షేర్ చేసుకోవడానికి నేను కూడా సోషల్ మీడియాలోకి ఎంటర్‌ అవుదామనుకుంటున్నాను. నేను ఇవ్వాలనుకునే మెసేజ్‌లు, చెప్పాలనుకునే విషయాలను ప్రజలతో చెప్పుకోవడానికి సోషల్ మీడియాను వేదికగా భావిస్తున్నాను. అందుకే నేను సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతున్నాను. అది కూడా ఈ ఉగాది నుంచే  అంటూ చిరంజీవి వీడియోలో పేర్కొన్నారు.  

 

ఈ మద్య కరోనా వైరస్ గురించి ఆయన పలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.  ఇకపై ఆయన ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకోవాలని నిర్ణయించారు. అందుకు ఉగాది రోజున శ్రీకారం చుడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తను భావాలను అందరితో పంచుకోవడానికి సోషల్ మీడియాను సరైన వేదికగా భావిస్తున్నానని చిరు చెప్పారు. ఇక తమ అభిమాన హీరో సోషల్ మాద్యమాల్లోకి ఎంటర్ అవుతున్న విషయం తెలిసి ఫ్యాన్స్ పట్టరాని ఆనందంలో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: