ప్ర‌తి ఒక్క‌రూ సోష‌ల్ మీడియా వాడ‌డంలో ముందుంటున్నారు. అందులోనూ సామాన్య‌ల‌క‌న్నా సెల‌బ్రెటీలు మ‌రి కాస్త ఎక్కువ‌గా వాడుతున్నారు. ఇక ఎక్క‌డైనా ఏమాత్ర‌మైన తేడా క‌నిపిస్తే అంటే స్పందించే విష‌యంలో ఎవ‌రు ఎలా స్పందించిన తేడా అనిపిస్తే నెటిజ‌న్స్ లెఫ్ట్ రైట్ వాయిం చేస్తున్నారు. సోష‌ల్ మీడియా ద్వారా నిల‌దీస్తున్నారు. ఇటీవ‌ల సోష‌ల్ మీడియా వేదిక‌గా క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో మ‌నం మూడ‌వ ద‌శ‌లోకి ఎంట‌ర‌వుతున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయ‌ని స్ప‌రించేలా త‌మిళ సూప‌ర్‌స్టార్ ఓ వీడియోని పోస్ట్ చేశారు.

 

దీనిపై నెటిజ‌న్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టించేదిగా ర‌జ‌నీ వీడియో వుంద‌ని అంతే కాక మ‌రింత భ‌య‌భ్రాంతుల‌కు గుర‌వుతున్నార‌ని ఇలాంటి వీడియోలా షేర్ చేసేది అన్న‌స్థాయిలో నెటిజ‌న్లు మండిప‌డ్డారు. విమ‌ర్శ‌ల వ‌ర్షం కుర‌వ‌డంతో వెంట‌నే ఆయ‌న ఆ వీడియోని తొల‌గించారు. ఇక ఇదిలా ఉంటే... తాజాగా అలాంటి ప‌నే బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ చేసి ప‌ప్పులో కాలేశారు. జ‌న‌తా క‌ర్ఫ్యూ సంద‌ర్భంగా అంతా సాయంత్రం బాల్క‌నీల్లోకి వ‌చ్చి డాక్ట‌ర్ల‌కు, న‌ర్సుల‌కు, పోలీస్ శాఖ వారికి సంఘీభావంగా హ‌ర్ష‌ధ్వ‌నాల‌తో చ‌ప్ప‌ట్లు కొట్టాల‌ని ప్ర‌ధాని సూచించారు. దీంతో జ‌నం నుంచి అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. దీనిపై బిగ్‌బి పెట్టిన పోస్ట్ వివాదంగా మారింది.

 

చప్ప‌ట్లు కొడితే వైర‌స్ పోతుందా? అంటే బిగ్‌బి పోస్ట్ పెట్టారు. దీంతో నెటిజ‌న్స్ బిగ్‌బీని ఓ ఆట ఆడుకున్నారు. మీలాంటి వారు ఇలాంటి పోస్ట్‌లు పెట్ట‌డం ఏంట‌ని నిల‌దీశారు. చ‌ప్ప‌ట్లు కొడితే వైర‌స్ పోవ‌డం కాదు. ఒక‌రోజంతా ఎక్క‌డివారు అక్క‌డ నిర్బంధంలో ఉంటూ ప్ర‌ధాని మాట‌ని జ‌వ‌దాట‌కుండా పాటించ‌డం పై అంతేకాక ఇంత క‌ష్ట‌కాలంలో కూడా ఇటు డాక్ట‌ర్లు, అటు పోలీసులు ఆ త‌ర్వాత జ‌ర్న‌లిస్టులు క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నందుకుగాను ఆయ‌న క్లాప్స్ కొట్ట‌మ‌న్నారని ఆయ‌న అభిప్రాయం. జ‌రుగుతున్న న‌ష్టాన్ని గ‌మ‌నించిన బిగ్‌బీ వెంట‌నే ఆ పోస్ట్‌ని తొల‌గించి ఏదో స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఈ విష‌యం మీద నెటిజ‌న్లు మాత్రం కాస్త ఫ‌ల‌య్యార‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: