కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తన ప్రభావం చూపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రపంచం మొత్తం కరోనా వైరస్ గుప్పిట్లో ఉంది. అది చెప్పిందే ప్రపంచం చేస్తుంది. దాని మాటే ప్రపంచం మొత్తం వింటుంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా తమ పౌరులను కాపాడుకునే ప్రయత్నాలు ఎకువగా చేస్తున్నాయి. పౌరులు ప్రాణాలు కోల్పోవడం తో ప్రభుత్వాలు ఇప్పడు కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నాయి. అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. మరి కొన్ని దేశాలు కర్ఫ్యూ ని ప్రకటించాయి. అవసరం అయితే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ కూడా జారీ చేసే పరిస్థితి నెలకొంది. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు సినిమా మీద కరోనా వైరస్ ప్రభావం మరింతగా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సినిమా షూటింగ్ లు దాదాపు ఏడాది వరకు జరిగే పరిస్థితి లేదని కరోనా వైరస్ ఇతర వైరస్ ల మాదిరిగా ఉండే అవకాశం ఉండదని అది ఒక్కరికి ఉన్నా సరే వెంటనే వేగంగా పాకే అవకాశాలు ఉంటాయని పూర్తిగా కేసులు అన్నీ కూడా నయం అయ్యే వరకు కూడా షూటింగ్ లకు గాని ఏ వినోద కార్యక్రమాలకు అనుమతి౦చకుండా జాగ్రత్తలు పడితే మంచిది అని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. 

 

త్వరలోనే దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీని ప్రకారం చూస్తే కరోనా వైరస్ కారణంగా సినిమా ఇంకా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సినిమాలను కూడా ఇప్పట్లో విడుదల చేసే అవకాశం లేదని అంటున్నారు. మరో ఏడాది వరకు లేదా ఆరు నెలల వరకు సినిమాలను విడుదల చేయడం అనేది జరిగే పని కాదని ఏ మాత్రం ఆదమరిచినా సరే ప్రాణాలు పోవడం ఖాయమని కాబట్టి కఠిన నిర్ణయాలు అవసరమని, సిని పరిశ్రమ కూడా దీనికి సహకరించాలని పలువురు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: