సోషల్ మీడియా.. ఇప్పుడు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అందరి కేరాఫ్ అడ్రస్ ఇదే. ఎవరైనా తమ వాయిస్ వినిపించాలంటే ఇప్పుడు అదే అసలైన వేదిక. గతంలో ఎంతటి స్టార్లు అయినా సరే.. తమ వాయిస్ వినిపించడానికి సంప్రదాయ మీడియాపైనే ఆధారపడేవారు.. పేపర్లోనో, టీవీలోనో వస్తే తప్ప తమ సమాచారం అభిమానులకు తెలిసిదే కాదు. అందులోనూ ఈ మీడియాలో తాము చెప్పదలచుకున్నది కరెక్టుగా వచ్చే అవకాశమే లేదు.

 

 

తాము చెప్పింది ఒకటైతే.. ఈ పేపర్, టీవీ విలేఖరులు రాసేది మరొకటి అవుతుంటుంది చాలాసార్లు.. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేశాక ఇప్పుడు స్టార్లు నేరుగా ఫ్యాన్స్ తోనే ఇంటరాక్ట్ అవుతున్నారు. తాము చెప్పాల్సింది నేరుగా చెబుతున్నారు. ఫ్యాన్స్ స్పందన తెలుసుకుంటున్నారు. అందుకే నిన్న మొన్నటి వరకూ దీనికి దూరంగా ఉన్నవారు కూడా దీనికి చేరువవుతున్నారు.

 

 

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాను బాగా వాడుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా తెరిచారు. రేపు ఉగాది సందర్భంగా ఇన్‌ స్టా గ్రామ్ ఖాతా ద్వారా తన ఫ్యాన్స్ ను పలకరించాలని అనుకుంటున్నారు. అందుకే తాజాగా ఆయన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ తీసుకున్నారు. Chiranjeevikonidela పేరుతో ఈ అకౌంట్ ఉంది.

 

 

అకౌంట్ ఓపెన్ చేసి.. కేవలం తన ప్రొఫైల్ పిక్ ను మాత్రమే పోస్టు చేశారు. కానీ ఆ ఒక్క పోస్టుతోనే చిరు ప్రభంజనం సృష్టించారు. ఈ పోస్టుకు సాయంత్రానికే 30 వేలకు పైగా లైకులు వచ్చాయి. చిరు 3 లక్షల మంది ఫాలోవర్లు వచ్చేశారు. ఇంకో విచిత్రం ఏంటంటే.. అప్పుడే చిరు ఇన్ స్టా అకౌంట్ కు బ్లూ వెరిఫికేషన్ మార్క్ కూడా వచ్చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: