ఈమధ్య తెలుగు సినిమాలు చూస్తుంటే గతంలో ఎప్పుడో ఎక్కడో ఈ కథ చూసినట్టుందే అనే ఆలోచన రాకమానదు. పాత సినిమాల్లో ఎక్కడో ఓ చిన్న పాయింట్ ఆధారంగా కొత్త కథలు అల్లడం.. ఫ్లాప్ అయిన సినిమాలు ఎక్కడ ఫెయిలయ్యాయో చూసి అందులో కొత్తగా కథ రాసుకోవడం మన క్రియేటివిటీ డైరక్టర్ల తెలివికి నిదర్శనం. ఇందులో తప్పు లేదు. కొత్త కథలు ఇలానే వస్తాయి మరి. ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా ఇటివల పూజా కార్యక్రమంతో స్టార్ట్ అయిన మూవీ పాగల్.

 

 

ఓల్డ్ మూవీ నుంచి తీసుకున్న కొత్త కంటెంటే పాగల్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. పదేళ్ల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. దర్శకుడు భాస్కర్సినిమా స్క్రీన్ ప్లేపై మరింత శ్రద్ధ పెట్టుంటే ఆరెంజ్ పరిస్థితి వేరుగా ఉండేది. పదేళ్లయినా ఫ్లేవర్ తగ్గని పాటలు ఆ సినిమాలో ఉన్నాయి. ఇప్పుడా సినిమా బేస్ లైన్ తోనే యువ హీరో విశ్వక్ సేన్ తన పాగల్ సినిమా తీస్తున్నాడని అంటున్నారు. ఆ సినిమాలో రామ్ చరణ్ అనేక లవ్ స్టోరీలు ఉన్న కుర్రాడిగా కనిపిస్తాడు.

 

 

ఇందులో కూడా లవర్ బాయ్ క్యారెక్టర్ తో పాటు అదే జోనర్ నెరేషన్ ఉంటుందని అంటున్నారు. అయితే.. అక్కడ మిస్ అయిన కంటెంట్ ని ఈ సినిమాలో జొప్పిస్తారని సమాచారం. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్, హిట్.. సినిమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ కు దర్శకత్వ ప్రతిభ కూడా తోడవడంతో ఈ సినిమా స్క్రిప్ట్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే సినిమా పూర్తై విడుదల కావాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: