టాలీవుడ్ లో అగ్ర నిర్మాతలుగా ఇండస్ట్రీని ఏలుతున్న వాళ్ళు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, రామోజీ రావు అన్న సంగతి తెలిసిందే. ఒక వైపు నిర్మాతలుగా మరోవైపు డిస్ట్రిబ్యూషన్- థియేటర్ల రంగంలో సక్సస్ ఫుల్ గా కోట్లని గడిస్తున్నారు. అంతేకాదు టాలీవుడ్ లో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా వీళ్ళ హవానే నడుస్తుంది అన్న సంగతి అందరికి తెలిసిందే.

 

ఈ నేపథ్యంలో గీత ఆర్స్ట్ కొన్నేళ్లుగా ఈ నిర్మాణ సంస్థకు అనుబంధంగా జీఏ-2 పిక్సర్స్ ని ఏర్పాటు చేసి ఈ బ్యానర్ లోనూ సినిమాలు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పంపిణీ రంగంలో దిల్ రాజు, సురేష్ బాబు ల కంటే అరవింద్ ఐడియాలజీ, స్ట్రాటజీ గాని డైనమిక్ గా ఉంటుంది. తాజాగా గీత ఆర్స్ట్ కి పోటీగా అదే ఫ్యామిలీలో మరో హీరో డిస్ట్రిబ్యూషన్ వార్ కి సిద్దమవుతున్నాడని ఆసక్తికరమైన సమాచారం.

 

మెగాపర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఈ నలుగురికి గట్టి పోటీగా నిలవనున్నారని అంటున్నారు. ఇప్పటికే తెలుగు సినిమాకు మార్కెట్ పరంగా పీదదైన వైజాగ్.. తూర్పు -పశ్చిమ గోదావరి ఏరియాల్లో చరణ్ లోకల్ కంపెనీలతో రిలేషన్ మేయింటైన్ చేస్తున్నారట. ఇది గీత ఆర్స్ట్ కు పోటీగా నిలబడటం కోసమేనా అంటూ ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు.
ఇక సినిమా వ్యాపారంలో ఎవరి టాలెంట్ వాళ్ళది... ఎవరి మైండ్ గేం, స్ట్రాటజీ వాళ్ళది. పరెఫెక్ట్ గా ప్లాన్ చేసి తన ఐడియాలజీతో చెక్ పెట్టాలే గాని సక్సస్ అవడం అన్నది సాధ్యం. 

 

సరిగ్గా ఈ పాయింట్ నే చెర్రీ ఇప్పుడు పంపిణీ రంగం వైపు వచ్చేలా చేసిందని అంటున్నారు. రంగస్థలం సినిమా బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. పంపిణీ దారులకు భారీ లాభాలొచ్చాయి. ఇక నిర్మాతల కింద ఉన్న డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు ఎంత చెబితే అంత పెట్టి సినిమా రైట్స్ కొనుక్కోవాల్సిందే. ఇందులో కాంప్రమైజ్ అయ్యోది ఉండదు. ఇప్పటికే చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ స్థాపించి సొంతగా సినిమాలు నిర్మిస్తోన్న సంగతి  తెలిసిందే. ఇప్పుడు అదే బ్యానర్ పై డిస్ట్రిబ్యూషన్ లోకి దిగబోతున్నారట. మరి ఇందులో చరణ్ ఎంతవరకు సక్సస్ అవుతాడో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: