చూపించడం  ఎలాగో తెలిస్తే చూసే కళ్ళకు మజాగా ఉంటుంది. ఏది ఎక్కడ దాచుకోవాలో సొత్తులు చూస్తాయి. వాటిని ఎలా దోచుకోవాలో పోకిరీ ఆకళ్ళ కళ్ళు చూస్తాయి. ఇది ఓ అందమైన యుధ్ధం. అందం కోసం నిరంతరం సాగే యుధ్ధం. ఈ యుధ్ధంలో ముద్దుగుమ్మలదే విజయం అనుకుంటారు. కానీ సూర్యుడు చూడని అందాలను కూడా చూసే కొంటె కళ్ళదే అసలైన విజయం.

 

ఇక తెలుగు సినిమా ప్రపంచం అంటేనే గ్లామర్ ఫుల్ గా కావాలి. అందుకే మన వాళ్ళు ఎపుడూ కొత్తందాల కోసం వేటాడుతూనే ఉంటాయి. అలాంటి వారికి ఇపుడు బెస్ట్ ఆప్షన్ గా అమ్రుతా అయ్యర్ ఉంది. ఆమె మళయాళీ కుట్టి. తొలి ఎంట్రీ కోలీవుడ్లో ఇచ్చింది. విజయ్ పక్కన బిగిల్ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా కీలక పాత్రలో నటించిన అమృత అయ్యర్  ఆ సినిమా సక్సెస్ తో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటోంది.

 

ఆమె తెలుగులో యాంకర్ ప్రదీప్ తో 30 రోజుల్లో ప్రేమిచడం ఎలా అన్న సినిమా చేసింది. కరోనా నేపధ్యంలో 25న విడుదల కావాల్సిన ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఇక ఆ మూవీలో యాక్ట్ చేస్తూండగానే పోతినేని రాం మూవీ రెడ్ లో ఆమె చాన్స్ కొట్టేసింది. ఈ రెండు సినిమాలు ఉండగానే మరో రెండు చాన్సులు వచ్చిపడ్డాయి.

 

దాంతో తెలుగులో అమ్రుతాలు కురిపించడం ఖాయమని తేలిపోతోంది. అమ్రుత అయ్యర్ ది ట్రెడిషనల్ ఫ్యామిలీట. ఆమె కుటుంబంలో ఎవరూ నటులు లేరుట. సినిమా అంటేనే తెలియని కుటుంబం నుంచి తాను సరదాగా మూవీస్ చేద్దామని వచ్చానని అంటోంది. తెలుగులో తన తొలి సినిమా విడుదల కాకుండానే అవకాశాలు వరసగా ఇస్తున్న టాలీవుడ్ కి థాంక్స్ అని చెబుతోంది

 

సినిమా ఫీల్డ్ అంటేనే గ్లామర్ ఫీల్డ్ అని తెలుసు అంటోంది. అయితే తాను మాత్రం అందంగానే అందాలను చూపిస్తానని అంతే తప్ప ఎక్కడా కట్టుతప్పనని చెబుతోంది. మరి ఈ అమ్మడు పై పై అందాలను చూపిస్తే ఈ ఫీల్డులో నిలదొక్కుంటుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా ఆత్రేయ చెప్పినట్లుగా కనిపించకుండా చూపించే అందమే అదుర్స్ కదా. అమ్రుత అదే నమ్మినట్లుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: