కరోనా ఎఫెక్టేమో గానీ వ్యవస్థలన్నీ మూగబోయాయి. ఎక్కడికక్కడ అందరూ సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం అందరూ ఇంట్లోనే స్వచ్చంధ నిర్బంధం అయిపోవటంతో ఇన్నాళ్లూ తామెంత ఫ్రీగా గడిపామో అనుకుంటూ ఆలోచన చేస్తున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితిని ఎవరూ కలలోనైనా ఊహించి ఉండరు. రోజురోజుకూ పరిస్థితులు తీవ్రమైతున్న వేళ అందరూ కామ్ అయిపోయారు. కొందరు ఈ సమయాన్ని వినియోగించుకుంటున్నారు. ఇందులో సినీ ఇండస్ట్రీ కూడా ఉంది. ఎందరో ఔత్సాహికులు తన పెన్నుకు పదునుపెడుతున్నారట.

 

 

ఇప్పటివరకూ తమ వద్ద ఉన్న కథలకు మరింత పదును పెడుతున్నారు. హీరోలు కూడా ఎవరెవరి వద్ద కథలున్నాయో ఎంక్వైరీ చేస్తున్నారట కూడా. ఇంటర్నెట్, వీడియో చాటింగ్, ఫోన్ కన్సర్సేషన్ ద్వారా కొందరు కథలు వింటున్నారని వినికిడి. మరికొందరు హీరోలు తమ బాడీ లాంగ్వేజ్ కు సూటయ్యే కథలను రాయాలని చిన్న చిన్న ఐడియాలు కూడా ఇస్తున్నారని అంటున్నారు. దీంతో అవకాశాల కోసం ఎదురుచూసేవారికి మంచి అవకాశం వచ్చినట్టైంది. ఖాళీగా ఉన్న టైమ్ లో తమ ఆలోచనలకు పదును పెట్టుకునే అవకాశం చిక్కింది. ఇన్నాళ్లూ ఫుల్ బిజీ వర్క్ లో టెన్షన్ టెన్షన్ గానే కథలు రాస్తూ ఎవరు అవకాశమిస్తారా అని చూసేవారికి ఈ గ్యాప్ ఉపయోగపడేదే.

 

 

పైగా.. మార్చి 31వరకూ ఉన్న లాక్ డౌన్ ఇప్పుడు ఏప్రిల్ 14వరకూ పొడిగించారు. దీంతో మరింత సమయం వచ్చినట్టైంది. పరిస్థితి మామూలు అయ్యేసరికి వీరంతా తమ టాలెంట్ కు పదును పెడితే మంచి అవకాశాలు దరి చేరడం ఖాయం. వీరంతా సరిగ్గా దృష్టి పెడితే మంచి కధలు వచ్చే అవకాశం.. కొత్త టాలెంట్ తో టాలీవుడ్ కళకళలాడే అవకాశం దక్కుతుంది. మరోపక్క సీనియర్లు కూడా తమ షూటింగ్ విశేషాలు, పరిస్థితి మెరుగయ్యాక సినిమాలు ఎలా తెరకెక్కించాలి అనే విషయాలపై దృష్టి పెట్టే అవకాశం వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: