రాం చరణ్ పక్కా మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆయన తన తండ్రి. మెగాస్టార్ లెగసీని హండ్రెడ్ పర్సెంట్ కంటిన్యూ చేస్తున్నారు. చెర్రీ చాలా తక్కువ టైంలోనే మెగాస్టార్ ఇమేజ్ కి చేరుకున్నారు. చెర్రీని సరైన కంటెంట్ తో కలిపి కొడితే ఆ  రిజల్ట్ ఎలా ఉంటుందో రంగస్థలం బ్లాక్ బస్టర్ మూవీ  చాటి చెప్పింది.

 

ఆ మూవీలో చెర్రీ నూటికి నూరు మార్కులు కొట్టేశాడు. నిజానికి జాతీయ అవార్డు కూడా చెర్రీ గెలుచుకుంటారని అంతా అనుకున్నారు. అయితే అది జస్ట్ మిస్ అయింది. ఇవన్నీ ఇలా ఉంటే చెర్రీ పక్కన చాన్స్ వస్తే ఎవరైనా మిస్ చేసుకుంటారా. కానీ వచ్చిన చాన్స్ మిస్ అయితే  ఎలా ఉంటుంది అంటే అచ్చం అనుపమ పరమేశ్వరన్ లాగానే ఉంటుందని చెప్పాలి.

 

ఆమెను చెర్రీ పక్కన రంగస్థలంలో మొదట అనుకున్నరట. ఆమెకు కొన్ని స్క్రీన్ టెస్ట్లు చేయించి చూసుకున్నాక చెర్రీ పక్కన మరీ చిన్న పిల్లలా ఉంటుందని డైరెక్టర్ సుకుమార్ వద్దు అనేశారుట. కానీ సరిగ్గా ఆ మూవీ కనుక పడి ఉంటే అనుపమ స్టార్ ఎక్కడికో వెళ్ళిపోయేది కదా అంటున్నారు.

 

ఇదిలా ఉండగా అనుపమ పరమేశ్వరన్ లక్కు ఓ వైపు బ్యాడ్ అంటూంటే మరో టఫ్ కండిషన్ పెట్టుకుందిట. నా అందం ఎవరికీ చూపించను, ఎక్కడా మితిమీరను. గ్లామర్ షోకు నేను దూరం అంటోందిట. మరి అలాగైతే సినిమాలు ఎలా వస్తాయి అమ్మడూ అంటున్నారుట.  ఇపుడు మూవీస్ లో హీరోయిన్ల నుంచి ఆశించేదే అది.

 

గ్లామర్ షోకు నో అని అనుపమ క్లారిటీగా చెప్పేయడం వల్ల ఆమెకు ఎన్నో మంచి ఆఫర్లే పోయాయని అంటున్నారు. కానీ తాను గీసుకున్న గీత నుంచి బయటకు రానని అంటోంది అనుపమ. ఓ అందమా నీవైనా చెప్పమ్మా అనుపమకు అందాల అనందాలు గోలేంటో. వాటి పవరేంటో అంటున్నారు ఆమె సంపాదించుకున్న యూత్ ఫ్యాన్స్ మరి అనుపమ రూట్ ఇకనైనా మార్చుకుంటుందా లేక ఇంతే నేనింతే అంటుందా. చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: